తట్టిలేపే బంధం

Thattilepey bandam_harshanews.com
తట్టిలేపే బంధం 

కష్టం మనిషికి శత్రువో, బంధువో
నాకు ఎరుక  లేదు కాని
అది మాత్రం నిజమైన మనిషిని,

కాదు కాదు...మనిషిని తట్టిలేపి

కష్టంలో స్పందించమని,సంధించమని
నెడుతుంది కేవలం మంచికే

నీ తోబుట్టువు లాంటి పొరుగువాడ్ని
నీకు ఏ బంధం లేకపోయినా
బంధాన్ని పెంచమంటూ

గంజి దొరికే కాలమే
గంగ తాగే కాలమో
ఏదైనా నీ దరిద్రంలో సైతం
దొరతనాన్ని చేర్చి
మనసుకి ఓ తృప్తిని
మరచిపోలేని
నెమరువేసుకునే అనుభూతిని
ఆపత్కాలము చిన్నదో,
పెద్దదో  తీరేకే బేరీజులు
కాని మనముందున్నంత సేపు
అదో గుదిబండే
ఆ విపత్కరమే కదా
మనిషిలో  నిజాన్ని
నిజమైన మనవాల్ని
స్వచ్చమైన మనిషిని దరిచేర్చేది !!

....................................................................................................

Thattilepey bandam_harshanews.com
శ్రీలత సవిడిబోయిన 
సీతానగరం, పర్ణశాల
 81063 59735