స్నేహ పరిమళం

స్నేహ పరిమళం
Image by Sasin Tipchai from Pixabay 

తోడు నీడలా వున్న
చెప్పుకోలేని మాటలు కొన్ని!

కోకొల్లపు బంధాలు వాకిట్లో
ముగ్గులు వేసిన చుక్కలు కొన్ని!

ఆపదలో అన్నీవున్న
శూన్యంలో ఏదో వెతుక్కుంటున్న
వైనాలు కొన్ని!

మమతానురాగల పందింట్లో
రక్తసంబంధ నీడల ఓదార్పులు కొన్ని!

అన్నివున్న కొన్ని చెప్పుకునే
మంచి మనుసున్న
విత్తు స్నేహాలు కొన్ని!

నాదంటు చెప్పుకునే స్నేహం
నీ స్నేహం
ఒకరినొకరు విశ్వాస గుడిలో
నమ్మకపు మ్రొక్కులతో
పంచుకొనే చిరస్థాయి నేస్తం
 'స్నేహం పరిమళం'
....................................................................................................

స్నేహ పరిమళం
పగిడిపల్లి సురేందర్​ పూసల
సికింద్రాబాద్
92907 01508