ఆమె

 ఆమె
Image by TRƯƠNG QUÂN from Pixabay 

బంగారపు కాంతితో
అందమైన ముఖ వర్చసు తో
ముత్యలాంటి పనువరుసతో
అమాయపు చూపులతో
చంద్రవంక లాంటి ముక్కుపుడకతో

లేత గులాబీరంగు పెదాలతో
కోయిలలాంటి స్వరంతో
 అభరణానికే  వన్నె తెచ్చే  సన్నని మెడతో

వంపు తిరిగిన నడుముతో
హంస నడకతో  వయ్యారంగా
గంతులు వేస్తూ చూస్తేనే
అక్షరించే ఆమె ముఖం

ఎప్పుడు పై పై మెరుపులతో
నిత్యనూతంగా కష్టాలను దిగమింగుతూ
కన్నీలని ఆస్వాదిస్తూ
రెయిబగళ్ళు అని తేడాలేకుండా 
కుటుంబ భారాన్ని మోస్తూ
గుర్తింపులేని జీవితాన్ని చూసి ఏడ్వలేక నవ్వుతూ

బాధను కడుపులో దాచుకుంటు
తన అందాన్ని అందరూ మెచ్చుకుంటే

నీరుగారిపోతున్న తన జీవితాన్ని
తలుచుకుంటూ కుమిలి కుమిలి
మనోవేదనకు అనుభవిస్తూ
ఎవరికి చెప్పలేక నవ్వలేక
వివాహం అనే బందీ ఖానలో
బందీ అయినది ఆమె జీవితం.
.............................................................................................................

 ఆమె
అనిత దావత్ 
హైదరాబాద్
93942 21927