అసామాన్యుడు పి.వి

అసామాన్యుడు పి.వి
అసామాన్యుడు పి.వి

కరీంనగర్ జిల్లా వంగర స్వగ్రామమైనా
మాతామహుల ఇంట లక్నేపల్లిలో జననం
అందరితో సమవర్తి ఆయనే పాములపర్తి

పిసిసి ఉపాధ్యక్షుడుగా ఉంటూ
భూదానోద్యమంలో భూములు పంచాడు
దానగుణంలో ఆయనకాయనే సాటి

మఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానిగా ఉన్నా
వారి తెలుగు భాషాసేవ అనన్యమైనది
అధికారభాషగా తెలుగును వెలిగించిన పివి

ఏళ్ళుగా పదవులకు దూరంగా ఉంటూ
రాజకీయాలకు దూరంగా ఉన్నాడు
మౌనిగా ఉంటూ మంత్రాంగం నడిపిన మేధావి

పదునాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడినా
తెలుగు హిందీ భాషల్లో రచనలు చేసాడు
దేశప్రధానిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర పి.వి
...........................................................................................అసామాన్యుడు పి.వి
మల్లెఖేడి రామోజీ
తెలుగు పండితులు
     అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా 
63047 28329