మానవులారా.. ఏకం కండి..

మానవులారా.. ఏకం కండి..
మానవులారా.. ఏకం కండి..


మనిషిని మనిషి మనిషిగా చూసే
మానవత్వం మన చిరునామా

కులాలూ మతాలూ 
మానవత్వాన్ని మాయంచేసే 
మాయాలోకాలు.

జనసంద్రంలో 
చావుపుట్టుకకు మధ్యలో 
సన్నని దారంపోగులాంటి 
అంతరాలు మనిషి మనిషి మధ్య 
భగ్గుమనే బీభత్స ప్రధాన దృశ్యాలు.

జాలి ,కరుణ ,దయ అనే సార్వజనీనమైన 
విశ్వమానవ సిద్ధాంతానికి పునాదిరాళ్ళు.
మానవాళి కళ్యాణానికి నందనవనాలు.

జనమంతారీతి
మనమంతా ఒకేజాతి
జగమంతా  ఒకేనీతి
ఇదే మాట పలుకుదాం
ఇదేబాట నడుద్దాం
ఇదేపాట పాడుదాం
దేశాలకు ఖండాలకు
మధ్య నున్న విభేదాల
అగాధాల పూడ్చేద్దాం
నీలోనాలో మనలో
ఒకేదృష్టి ఒకే సృష్టి 
ఒకే బ్రతుకు ఒకే వెలుగు
కలిగేలా కదలుదాం...

..................................................................................................................


మానవులారా.. ఏకం కండి..
డా.నాయకంటి నరసింహ శర్మ,
వనపర్తి.
94413 57400,
83412 49673.

Post a Comment

0 Comments