పోతన మొగ్గలు

పోతన మొగ్గలు
పోతన మొగ్గలు

కౌండిన్య గోత్రజ లక్కమ్మ కేసన  దంపతుల వరపుత్రుడై 
వీరభద్ర విజయఢంకా మోగించిన శివభక్త కవి
శిష్యరికం యెరుగని సహజ కవి పండితుడు పోతన్న 

సర్వజ్ఞ రసిక సింఘభూపాలునికి 
దుర్గారాధనగ భావించి భోగినీ దండక కావ్యాన్ని అంకితమిచ్చిన యువకవి
పండిత పామర జనరంజక కవి పోతన్న 

సంస్కృత ఆదిశంకరునిశైలి  అలరారిన 
పాండిత్య వేదాంత వినయ విచక్షణ కల ప్రజాకవి 
విష్ణుతత్వ ప్రచారకుడు నారాయణ శతకకర్త పోతన 

సంస్కృత భాగవతానికి తెలుగుదనాన్ని జోడించి 
భక్తిరసాన్ని వొలికిస్తూ  రామునకంకితమిచ్చారు 
మనిషిని దిద్దే మహాగ్రంధం పోతన  భాగవతం 

తల్లీ నిన్ను దలంచి పుస్తకం చేతంబూనితిన్ 
అనే పద్యాన్ని అక్షరాభ్యాసంతో పాటు నేర్పుతారు
పరమ భాగవతోత్తముడు     పోతనామాత్యుడు 

భారత ప్రధాని శ్రీ పి వి నరసింహారావు గుర్తించి 
వైభవోపేతంగా పంచశతి  ఉత్సవాలు చేశారు
భారతదేశ తెలంగాణ ప్రజల అభిమాన కవి పోతన

.........................................................................................................
పోతన మొగ్గలు
జి. శాంతారెడ్డి, 
మహబూబ్ నగర్
80081 77325