ఎంత కాలమిలా మౌనం..

ఎంత కాలమిలా మౌనం..
ఎంత కాలమిలా మౌనం..

ఇంకా ఎంత కాలమిలా మౌనం గా వుంటావు
దుఃఖాన్ని,బాధనీ గుండె లో మోస్తూ
జీవచ్ఛవంలా బతుకుతున్న సోయైనా లేకుండా
అందరిలో ఒకరిగా
ఒక్కడివే అందరిలా
నీలో నీవే ఏకాకి లా
ఎంత కాలమిలా వుంటావ్

అగ్ని పర్వతం బద్దలై
లావా ఎగిసిపడే పడుతుందో రోజు
బాష్పబిందువులు బలీయమైన
మేఘం వర్షిస్తుందో రోజు
కూడలి కల్లోల సాగరమై
సునామీ లా విరుచుకుపడుతుంది.
ఇవన్నీ జరిగేది ఓర్పు నశించాకే.

మరి నీవూ అంతేనా?
ఎపుడు వస్తుందా రోజు
అంతవరకు బడబాగ్ని లా
బాధలు మునిపంటితో నొక్కి పెడతావా?
అనుమానం, అవమానం దిగమింగుకుంట
లో లోపలే కుమిలిపోతూ
కృశిస్తూ, అనారోగ్యం పాలవుతూ
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ
ఎందుకిలా?

ఇప్పటికైనా నోరు తెరువు...
నిరూపించుకోవడం నిన్ను నీవు!!
.............................................................................................................
   
ఎంత కాలమిలా మౌనం..
యం.పి.ఊర్మిళా జ్యోతి
 98486 75917