శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు కూల్చివేయాలి


  • వర్షాకాల నేపథ్యంలో రెయిన్​ వాటర్​ హార్వెస్టింగ్​ నిర్మాణాలు
  • పారిశుధ్యం ప్రత్యేక దృష్టి సారించాలి
  • కరోనా కట్టడిలో కరీంనగర్​జిల్లా బేష్​
  • పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​
  • కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై సమీక్షా సమావేశం  

శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు కూల్చివేయాలి_harshanews.com
సమావేశంలో మాట్లాడుతున్న  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​: రానున్న వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్​ సిబ్బందికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సూచించారు.  కరీంనగర్, నిజామాబాద్​ కార్పొరేషన్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని,  కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల వాటర్ మ్యాప్ ని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. కరీంనగర్ పురపాలక శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం కరోనా కట్టడి విషయంలో అద్భుతమైన నిబద్ధత చాటారని  మంత్రి అభినందించారు.  పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్మశాన వాటికలు, పార్కులు ,జంక్షన్లలో అభివృద్ధి చేయాలని చెప్పారు. పట్టణాల్లోని వేస్ట్ మేనేజ్మెంట్ పద్దతుల పైన సమీక్ష నిర్వహించుకుని ఆదర్శవంతమైన పద్ధతులను అందిపుచ్చుకోవాలన్నారు. రెండు పట్టణాలు ఆధునిక స్లాటర్ హౌస్ లను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని తెలిపారు.   రెండు కార్పొరేషన్లు వాటర్ , ఎనర్జీ ఆడిటింగ్ రానున్న 15 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు  గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి , కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు  రసమయి బాలకిషన్,  గణేష్ గుప్తా,  జీవన్ రెడ్డి,  బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.