ఓర్వలేని తనం..Orvalenithanam_harshanews.com
ఓర్వలేని తనం..

కనుపాపల లో నీ రూపు
తొలిచూపుల బంధమై..
కవ్వింతల కలవరింతలు రేపగా..
ఓర్వలేని .. నిదుర.. దూరమైంది

మదిని మీటిన నీ మాటల మాధుర్యం ..
మళ్ళీ మళ్ళీ మారాకు వేయగా..
ఓర్వలేని.. మనసు..
ఉద్విగ్నత నింపుకుంది..

అంతరాల భావనలు..
ఆశల నిచ్చెన వేసి..
భావావేశాన్ని పంచి..
బంధనాలను పెంచగా..
ఓర్వలేని .. ఆలోచనలు..
అలసటగా నిట్టూర్చాయి..

పల్లవించిన మనసు..
పరుగులు నేర్చి..
యవ్వనం..పదనిసలు నేర్పగా
ఓర్వలేని ... పరువం...
పయ్యెద చాటున దాగెను..

నీ.. రాక కై.. నీ మాటకై..
నీ సన్నిధి కై.. వేచే..
తనువు.. మనసుల..
తహ తహల నిరీక్షణలో...
నామదినే నిలిచిన నిను కాంచి..
ఓర్వలేని... ఒంటరి..
ఓడిపోయి....పారిపోయింది.

......................................................................................................

     
Orvalenithanam_harshanews.com
పోపూరి మాధవీలత
హైదరాబాద్