గుండె పండుగ

gundepandaga_harshanews.com
గుండె పండుగ 


ఒక్కసారి నిన్ను చూసినందుకా
నా కన్నులకింతటి కాంతి..

నీ పేరు పదే పదే.... పలికినందుకా..
నా మాటలకంతటి మాధుర్యం...

గుండె నిండా నీ రూపు నిండి నందుకా
నా గుండెకింతటి పండగ ..

హృది నిండా నీ ఊహలు..
పొంగిపొర్లినందుకా 
నా హృదయానికి ఇంతటి..
పరవశం..

నా వెలుగు చిరునామావి...
నా బ్రతుకు చిత్రానివి...
నా గుండెలో భావానివి...
నా కవిత లో ఆర్తివి ....
విరామమెరుగని  నా గుండెలయవు...
నా స్పందనవి...
నా ఆత్మీయస్పర్శవు...
గాజుకళ్ల లాంటి
నా నయనాలలో జీవకళ నీదే...
నా అదరాలపై  లాస్యానివి..
జీవం లేని నా జీవితాన
వెలిగిన ప్రాణదీపానివి..
నా చెలివి నా చెలిమివి
నువ్వే నువ్వే...


gundepandaga_harshanews.com
మాధవి శ్రీనివాస్ నందిమళ్ల
హైదరాబాద్