అమ్మ-నాన్న.. నేను

అమ్మ నాన్న నేను
అమ్మ-నాన్న.. నేను

అమ్మ నాన్నల ప్రపంచం నేనే
వారి ప్రతీ ఆనందం, సంతోషం నాతోనే
వారి ఊపిరిగా,
ఓ కంటిపాపగా ఉంటూ
వారి ఆప్యాయతల్ని పొందుతూ
అనుక్షణం ఓ గారాలపట్టిలా
వారిరువురి ప్రేమసామ్రాజ్యానికి
ఓ మహారాణిలా.....
గడిచిపోయిందిన్నాళ్ళు...

ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు.

నా ఆనందం, సంతోషం వెనుక
వారి ఎన్ని త్యాగాలున్నాయో???

కంటిపాపగా నను కాపాడుకునే
వారి జీవిత పయనంలో
ఎన్ని కన్నీళ్ళకు
నేను కారణమయ్యానో???

వారి ఓర్పు, సహనం, త్యాగం, ప్రేమ
అనే నాలుగు కాళ్ళ సింహాసనం పై
ఓ మహారాణిలా నేనెలా సాగిపోయానో???

నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది...

ఎందుకంటే????

ఇపుడు నేను అమ్మనయ్యాను...
...................................................................................................................

అమ్మ నాన్న నేను
జ్యోతి రాజ్.భీశెట్టి
హైదరాబాద్
99853 98889