అర్జునుడికి తప్పిన ముప్పు

అర్జునుడికి తప్పిన ముప్పు
అర్జునుడికి తప్పిన ముప్పు

మహాభారతం యుద్ధంలో కౌరవుల  పక్షనా మహా మహులు ప్రాణాలు వదిలారు. విల్లు పడితే ఎదురు లేని భీష్ముడు సైతం కదన రంగంలో అంపశయ్య మీద ఉన్నాడు. పాండవులు ఐదుగురు లక్షణంగా ఉన్నారు. అప్పటికే  కౌరవుల తరపున పేరొందిన వీరులు హతమయ్యారు. ఇక మిగిలింది కర్ణ,దుర్యోధనులు,కొద్ది పాటి వీరులే.ఇది దుర్యోధనుడికి  కలవర పాటు కలిగిస్తోంది. భీష్ముని కంటే కర్ణుని పైనే  ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు దుర్యోధనుడు. చింతా క్రాంతుడైన దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు కర్ణుడు.

"మిత్రమా! దేనికి చింతిస్తున్నావు? "ప్రశ్నించాడు. ఆ ప్రశ్న కు దుర్యోధనుడు "కర్ణా మన శిబిరంలో చాలా వరకు  మహా వీరులు మరణించారు. ఆ పాండవులు ఐదుగురు అలాగే ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కరైనా....."

అంటూ చేతులు బిగించాడు.దుర్యోధనుడు బాధ అర్ధం అయింది కర్ణునికి. " మిత్రమా రేపు అర్జునుని మరణం నువ్వు  చూస్తావు "అన్నాడు.ఆ మాటకు ఆనందపరవశుడైనాడు దుర్యోధ నుడు. "కర్ణా నాకు కావలసింది అదే.ఇక భీముని సంగతి నేను చేసుకుంటా నా గదా ఘాతంతో భీమున్ని  నేను మట్టు పెడతాను "అన్నాడు. సంతోషంతో మిత్రులిద్దరు ఒకరి నొకరు ఆలింగనం చేసుకున్నారు.

మరుసటి రోజు కర్ణ, అర్జునుల యుద్ధం సాగుతోంది.ఇరువురి పోరాట పటిమ అద్భుతం.గెలుపు ఎవరిదో  చెప్పటం కష్టమవుతుంది.ప్రతి అస్త్రాన్ని కర్ణుడు తుత్త నీయలు చేస్తున్నాడు.అదే రీతిలో అర్జునుడు కూడా.ఇదంతా చూస్తున్న శ్రీ కృష్ణునికి ఆందోళన కలిగింది.వెంటనే కర్ణుడు బాణాన్నిసందిస్తూ " అర్జునా ఇదిగో నీ పాలిట మృత్యువు నాగస్త్రం"  అని చెప్పి వదిలాడు.అలా చెప్పకుండా వడలాలిసింది. అదే కర్ణుడు చేసిన తప్పు.

వెంటనే కృష్ణుడు రథంను పాదం తో కిందకు తొక్కాడు.ఆ అస్త్రం అర్జునుని కిరటం ను చీల్చి వేసింది.మళ్ళీ వెనక్కి వచ్చిన నాగాస్త్రం " కర్ణ!  ఆ కృష్ణుని మాయోపాయం వల్ల గురి తప్పాను. మరోసారి నన్ను ప్రయోగించు ఆ అర్జునుడి తల ఖండించి వేస్తాను" అంది.

అప్పుడు కర్ణుడు " వీరులు ఒక అస్త్రాన్ని  వాడిన తరువాత అదే అస్త్రాన్ని రెండో సారి  ప్రయోగించరు" అన్నాడు.ఇది కృష్ణుడికి తెలుసు.ఒక వేళ రెండోసారి  కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించి ఉంటే అర్జునుడు ఉండే వాడు కాదు. అలా కర్ణుని నాగాస్త్రం ను నిర్వీర్యం చేసి అర్జునుడికి ముప్పు  తప్పించాడు. అంతా శ్రీ కృష్ణ మాయ.

.....................................................................................................................................

అర్జునుడికి తప్పిన ముప్పు
కనుమ ఎల్లారెడ్డి
అధ్యాపకులు,
  93915 23027.