Birthday Special

Birthday Special_harshanews.com
Birthday Special 



ఓ వైపు జూనియర్​ తెలుగు పండితురాలిగా.. మరో వైపు కవిగా రాణిస్తున్నారు.. ఆమె రాసిన కవితలకు ఎన్నో అవార్డులు వరించాయి.. కవి సమ్మేళనాలల్లో సన్మానాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.. విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చేందుకు వినూత్న అంశాలను బోధిస్తున్నారు.. వాటితో పాటు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు..  ఇప్పటి వరకు 67 వరకూ సన్మానాలు పొందారు. 2018లో స్త్రీ శక్తి- రాష్ట్రస్థాయిలో, సేవా భారతి-జాతీయస్థాయిలో, 2019లో గౌరవ డాక్టరేట్ లభించింది.. ఆమె ఎవరో కాదు డాక్టర్​పోల సాయిజ్యోతి.. ఈ నెల 11న ఆమె జన్మదినోత్సవం సందర్భంగా మీ కోసం..

పేరు: డాక్టర్​ పోల సాయిజ్యోతి 
జన్మస్థలం: పెద్దకొత్తపల్లి, నాగర్ కర్నూల్ జిల్లా
తల్లిదండ్రులు:  పోల సుశీలమ్మ, కీ.శే. పోల బాలస్వామి
భర్త : కొండూరు ఉమామహేశ్వర్ (టీచర్) 
కూతురు: కొండూరు.పూజిత 
పుట్టిన తేదీ: 11.7.1974
విద్యార్హతలు: M.Com,M.A. Telugu, B.Ed
వృత్తి : జూనియర్ తెలుగు పండితురాలు, యు.పి.ఎస్. గట్టుతుమ్మెన్, బల్మూర్ మండలం,నాగర్ కర్నూలు జిల్లా.
ప్రవృత్తి : రచనలు చేయడం, కవి సమ్మేళనాలలో పాల్గొనడం, టీవీ షో లలో పాల్గొనడం, వివిధ రకాల పత్రికలకు కాలమ్స్ పంపించడం, విద్యార్థులకు వినూత్న అంశాలను నేర్పించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం (వ్యక్తిగతంగా, సంస్థలు, సంఘాల ద్వారా) 

Birthday Special_harshanews.com
వృద్ధులకు పండ్లను పంపిణీ చేస్తున్న సాయిజ్యోతి


సన్మాన సత్కారాలు 
2015లో ‌‌- 1
2016లో- 3
2017లో- 6
2018లో 28 సన్మానాలు
2020లో- 4
2019లో-25 సన్మానాలు
కోవిడ్-19 పీరియడ్ లో-13 ఆన్​లైన్​ప్రశంసా పత్రాలు 
(కోవిడ్-19 Quiz, తెలుగు భాషకు సంబంధించిన Quiz,...... మొదలైనవి.

Birthday Special_harshanews.com
ప్రశంసా పత్రాలతో సాయిజ్యోతి, విద్యార్థులు


బిరుదులు 
2018-స్త్రీ శక్తి- రాష్ట్రస్థాయిలో, సేవా భారతి-జాతీయస్థాయిలో..
2019-గౌరవ డాక్టరేట్, స్ఫూర్తి రత్న-రాష్ట్రస్థాయిలో, సాహిత్య జ్యోతి-జాతీయ స్థాయిలో,
ANR విశిష్ట సేవారత్న అవార్డు-రాష్ట్రస్థాయిలో, వాగ్దేవి-జాతీయస్థాయిలో..
మనం -మన ఊరి బడి అవార్డు-ఉభయ తెలుగు రాష్ట్రాలు
ఉత్తమ కవయిత్రి సేవా పురస్కారం-జాతీయస్థాయిలో..
నేషనల్ యూత్ ఐకాన్-2020 Best Teacher Award.
21.10.2018-వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్-100 ఆటల పేర్లు చెప్పినందుకు,
1.5.2019-తెలుగు బుక్ ఆఫ్ రికార్డు (నాతో పాటుగా 16 మంది విద్యార్థులు కూడా వివిధ రకాల తెలుగు అంశాలను అనగా పద్యాలు, సామెతలు, బాలగేయాలు.... మొదలైనవాటికి తీసుకున్నారు)
14.6.2019న రేడియోలో అక్షర శిల్పాలు పేరిట నా స్వీయ కవితా రచనలను గానం.
శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ వారి Covid-19-ప్రశంసా పత్రం.

కోవిడ్-19-సందర్భంగా విజయనగరం వారు నిర్వహించిన బాల సుధ పోటీలలో 80 మంది విద్యార్థులను పాల్గొనేలా చేసి, వారికి బండారు బాలానంద సంఘం వారిచే వచ్చిన ప్రశంసాపత్రాలను అందించడం.
పాఠశాల విద్యార్థులు తెలుగు భాషకు సంబంధించి జిల్లా ఎడిషన్ లో రావడం. (అమ్రాబాద్, అవురుపల్లి, గట్టుతుమ్మెన్-2సార్లు)
ANS24& కళాతపస్వి , లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన సినీ గీత లహరి లో  విజయం.

టీచర్ గా మర్చిపోలేని విషయం
అవుర్ పల్లిలో పని చేస్తున్నప్పుడు రేషనలైజేషన్ ద్వారా నా పోస్టు పోతుంది అనగానే మా విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పి సర్పంచ్ కి ఫోన్ చేయించడం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి మాకు టీచర్ ఉండాలి అని అడగడం, హరితహారం కార్యక్రమం జరిగినప్పుడు అక్కడికి వచ్చిన అధికారులతో కూడా మాకు మా టీచర్ ఉండాలి అని విద్యార్థులు అడగడం ఎప్పటికి మర్చిపోలేని విషయం.

స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు-అమ్మానాన్నలు
సమాజానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలనుకుంటున్నాను.
లక్ష్యం-చరిత్రలో మనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకోవడం.

ఒక మంచి మాట: 
అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. నా/మా వలన ఎవరూ బాధపడకూడదు.

Post a Comment

0 Comments