అమ్మ అంటే..

అమ్మ  అంటే..
అమ్మ  అంటే..

ఆ దినకరుడు ఇచ్చేటి వెలుగును
మన బ్రతుకున కురిపించేది అమ్మే కదా

ఆ  రేరాజు చిందించే వెన్నెలలు
మన జీవితాన నింపేది అమ్మే కదా

ఒకరు పగలు కనిపిస్తే
ఒకరు రాత్రి మురిపిస్తే
పగలు రాత్రి తేడా లేక
మీ ఉన్నతి కై శ్రమించేది
అమ్మే కదా

ప్రతి చోటా తన ఉండలేక
ఆ దేవుడు సృష్టించాడు అమ్మని
ప్రతి నిమిషం మన వెంట ఉండలేక
అమ్మను పంపాడు ఆ దేవుడు
తనకు మారుగా
ఆకాశమంత మనసు ఉన్నది
ఆ భూదేవంత ఓరిమి కలిగినది
నీ కష్టాల్లో లో ఓదార్పు అయ్యేది
నీ సుఖాల్లో తన సంతోషం వెతికేది
అమ్మే కదా మన అమ్మే కదా


....................................................................................................

అమ్మ  అంటే..
రమావేవి బుక్కపట్నం
దిల్ షుక్​నగర్​,
హైదరాబాద్​
98495 96053