అభివృద్ధి పనులు ఆలస్యమైతే క్షమించేది లేదు

  • 20నుంచి 25 తేదీల్లో డబుల్​ బెడ్​రూం ఇండ్లు ప్రారంభోత్సవం
  • నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్లను బ్లాక్​లిస్టులో పెట్టాలని అధికారులకు ఆదేశం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు
 
అభివృద్ధి పనులు ఆలస్యమైతే క్షమించేది లేదు_harshanews.com
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి


వ‌రంగ‌ల్: అభివృద్ధి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయాలని, ఆలస్యమైతే క్షమించేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హెచ్చరించారు. వరంగల్​ రూరల్​ కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాల్​లో  పర్వతిగిరి రాయపర్తి మండలాల డబుల్​ బెడ్​రూం ఇండ్లు, పలు అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. డబుల్​బెడ్​రూం ఇండ్లు, కొత్తగా ఉపాధి హామీ కింద వచ్చిన కల్లాలను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి జరుగుతున్న ఆలస్యంపై కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తున్నా ఇండ్లను పూర్తి చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందన్నారు. ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్​లిస్ట్​లో పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల 25‌‌–25 తేదీల్లో డబుల్​ బెడ్ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 

అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర పర్యటనలు నిర్వహించాలని, స్థానిక ప్రజాభి ప్రాయాలు, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని సూచించారు.   రూర్బన్​ ప్రాజెక్టు కింద పర్వతగిరికి మంజూరైన రూ.30 కోట్ల నిధులను ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేయాలనే అంశంపై మంత్రి ఎర్రబెల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​తో కలిసి ఖరారు చేశారు. 

ఈ కార్యక్రమంలో వరంగల్​రూరల్​ జిల్లా కలెక్టర్​ హరిత, ప‌ర్వతగిరి ఎంపీపీ క‌మ‌ల‌, జెడ్పీటీసీ సింగ్ లాల్, పిఎసిఎస్ చైర్మన్​మ‌నోజ్, ఎంపీడీఓ సంతోశ్, ఎమ్మార్వో మ‌హ్మద్ పాషా, రాయ‌ప‌ర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, రైతు స‌మ‌న్వయ స‌మితి క‌న్వీన‌ర్ సురేంద‌ర్, బిల్లా సుధీర్ రెడ్డి,   న‌ర్సింహానాయ‌క్ త‌దిత‌రుల‌తోపాటు వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా డిఆర్ డిఎ పిడి సంప‌త్, పంచాయ‌తీరాజ్ ఇఇ సంప‌త్, ఇరిగేష‌న్ శాఖ ఇఇ శ్రావ‌ణ్, జిల్లా వ్య‌వ‌సాయ‌శాఖ అధికారిణి ఉష‌, ఆర్డీఓ మ‌హేంద‌ర్, వివిధ శాఖ‌ల అధికారులుపాల్గొన్నారు.

Post a Comment

0 Comments