లక్ష్మీ...రావే మా ఇంటికి

 
లక్ష్మీ...రావే మా ఇంటికి_harshanews.com
లక్ష్మీ...రావే మా ఇంటికి 

ఘల్లు ఘల్లున రావే...హిమగిరి పుత్రి
సంగీత,సాహిత్యాలతో రావే వీణా ధరిత్రి!!

పసుపు-కుంకుమతో రావే 
పంచవన్నెల పావని 
పూలు-పండ్లతో రావే పగడాల పరమేశ్వరి!!

ఈ గడప ఆ గడప జూడంగ రావే ధరిత్రి
ఈ పచ్చ ఆ పచ్చ అందించ రావే అలివేణి!!

అలంకరణ చూసి మురిసి పోవే ముగ్ధమనోహరి
కరుణ జూపి కటాక్షించవే కనకమయీ!!

రవిక- గాజులు నీ కిత్తుమే వరాలరాణి
ముతైదుతనం మా కియ్యవే మన్మథరాణి!!

పసిబాలవై రావే పారాడుతూ రావే 
బాలగౌరివై రావే పలుకు తేనెల తల్లి వాగ్దేవివే!!

రంగవల్లులతో నిన్ను స్వాగతింతు వయ్యారి 
తథ్థిమిత తకథిమిత అని ఆడవే మయూరి!!


లక్ష్మీ...రావే మా ఇంటికి_harshanews.com
లక్ష్మీ...రావే మా ఇంటికి 

బంతి-చేమంతి,జాజి-విరజాజితో విరిబోణివై
సంపంగి, మందారం,వర్ధనం,దవనాలతో దాక్షాయణివై!!

అమ్మవు నీవే అఖిల జగాలకు జగత్జననివై
అమ్మవు నీవే సకల వరాలకు వరదాయినివై!!

ఓం మాయాని,ఓం శర్వాణి, ఓం గీర్వాణి వందనం 
ఓం రుద్రాణి,ఓం కళ్యాణి, ఓం రౌద్రాణి వందనం!!

మగవ నుదుట సింధూరమై..నయనానందమై
గళమున కాంచన హారమై...
గలగల మని సవ్వడియై....
వరలక్ష్మీ...రావే మా ఇంటికి 
క్షీరాబ్దిపుత్రి!!  
.................................................................

లక్ష్మీ...రావే మా ఇంటికి_harshanews.com

-  నాట్యమయూరి టి.వి.శిరీష
హైదరాబాద్
96184 94909   
Post a Comment

0 Comments