కొత్త ప్రయాణం

కొత్త ప్రయాణం
కొత్త ప్రయాణం

జీవనగమనం
నేడు నేర్పతుంది
సరికొత్త జీవనగీతం
ఊహించని పరిణామాలు
ఊహకందని మాయాజాలం (రోగం)

మనిషెంతెదిగిన
మనిషి మనిషేననీ
అంతరిక్షంలో అడుగుపెట్టిన
పాతళంలోకి పాదంమోపిన
భగవంతుడిచ్చిన
పచ్చని ప్రకృతికి
వికృతిలా మారుతున్నాడు

నేడెంత సాంకేతిక పరిజ్ఞానం
సాధించినా..
నాటి అడుగుల్నే
నేడు వెతుకుతూ..
మందహాసం మాయమై
మరోవైపు పయనం సాగిస్తుండు
 ..............................................................................................


కొత్త ప్రయాణం

సి.శేఖర్,
  సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు,
            పాలమూరు,
      90104 80557 
      

Post a Comment

0 Comments