చెప్పుకుంటే కథలెన్నో..

చెప్పుకుంటే కథలెన్నో.._harshanews.com
చెప్పుకుంటే కథలెన్నో..


ఆమెలోని సాహిత్యాభిలాష కు సామాజిక కోణం తోడైంది. చుట్టూ కనిపించే ఎన్నో సంఘటనలు ఆమె కథల్లో ఇతివృత్తాలుగా మారాయి.  మదిలో మెదిలే భావాలు, వివిధ సంఘటనలపై కలిగే స్పందనలను అక్షరరూపం దాల్చిన ఆ తర్వాత సోషల్ మీడియా వాల్ పై "కాఫీ విత్ కామేశ్వరి"గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చాయి. వందకు పైగా కథలు, 200కు పైగా వ్యాసాలతో ఆమె పాఠకుల మదిలో సుస్థిర స్థానం పొందారు సామాజిక సేవలోనూ ముందుండే ఆమె కరోనా సమయంలో ఎంతోమందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల ను సందర్శించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పరిచయం....

చెప్పుకుంటే కథలెన్నో.._harshanews.com
దుస్తులను  అందిస్తున్న కామేశ్వరి


పేరు
చెంగల్వల కామేశ్వరి

పుట్టినతేది
జూలై 14

తల్లితండ్రులు
ఇలపకుర్తి  సీతారామాంజనేయశర్మ– రాధాదేవి.

చదువు:  డిగ్రీ

వృత్తి:  గృహిణి

ప్రవృత్తి: 
మనసు స్పందించినపుడు రచనలు చేయడం

అభిరుచులు:
గ్రంధపఠనం, ప్రయాణాలు, రచనలు, పెట్స్, గార్డెనింగ్ సామాజికసేవ. ఇష్టమైనవారందరికీ వండి వడ్డించటం.

నాకు ఇష్టమైన వారు :  ఫ్రెండ్స్

స్పూర్తినిచ్చినవారు:   తల్లితండ్రులు, ఫ్రెండ్స్.

చెప్పుకుంటే కథలెన్నో.._harshanews.com
కవి సమ్మేళనంలో సన్మానం


ఇప్పటివరకు రాసిన రచనలు వందకు పైగా కథలు, రెండువందలపైగా వివిధ అంశాల పై వ్యాసాలుసమాజానికి ఏమి చేయలేకున్నా నా చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచగలడం వారి బాధలను తీర్చడానికి ప్రయత్నించడం మాత్రమే తెలుసు.సాహితీ రంగంలో , సేవారంగంలో  పురస్కారాలు చాలానే అందుకున్న ఆకలితో ఉన్నప్పుడు వారికి అన్నం పెట్టినప్పుడు వారి కళ్ళలో కనిపించే సంతృప్తిని మించిన సంతోషం ఏ పురస్కారాలు ఇవ్వవు.

Post a Comment

0 Comments