మహిళలకు ఆదర్శం.. దుర్గాబాయి జీవితం

మహిళలకు  ఆదర్శం..  దుర్గాబాయి జీవితం_harshanews.com
మహిళలకు  ఆదర్శం..  దుర్గాబాయి జీవితం స్వాతంత్ర్య  సమర యోధురాలు గా, సంఘ సేవకురాలు గా, రచయిత్రి గా,  సంఘ సంస్కర్త గా, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులుగా పేరు పొందిన దుర్గా బాయి దేశ్ ముఖ్ మహిళా లోకానికి ఆదర్శ మనడం అతిశయోక్తి కాదు.మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వనిత, దేశా భివృద్దికి పాటుపడిన నేత, సమాజానికి నిస్వార్థం గా సేవ చేసిన స్పూర్తి ప్రదాత  దుర్గా బాయి దేశముఖ్.
 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రీ పట్నం లో కృష్ణ వేణమ్మ,
రామారావు దంపతులకు1909 జూలై 15 న దుర్గా బాయి జన్మించారు.గుమ్మడి దల. దుర్గా బాయమ్మ ను దుర్గా బాయి గా పిలుస్తారు. ఆమెకు దేశ్ ముఖ్ తో వివాహాం జరిగిన తర్వాత దుర్గా బాయి దేశ్ ముఖ్ గా మారారు.

బాల్యం నుండి దుర్గాబాయి తన ప్రతిభా పాటవాల తో అందర ని ఆకట్టుకునేది. ఆమె ఆటపాటల లో అందవేసిన చెయ్యి.చదువు లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చాల చురుకైన వ్యక్తి. రంగ వల్లులు వెయ్యడం లొ ఆమె కు ఆమే సాటి. పూలజడ లనువేయడం లోను బహు నేర్పరి.
హిందీ భాష లో పాండిత్యాన్ని సంపాదించింది. వీణా వాదన లోను "రాణి " గా నిలిచింది.పద
కొండే ళ్ళ ప్రాయం లోనే ఆమె కాకినాడ లో హిందీ పాఠశాల పెట్టి చాలా మంది స్త్రీలకు హిందీ భాష ను భోదించడంతో పాటు పద్యాలు, పాటలు, కోలాటం, నాటకాలు, రంగవల్లులు మొదలైన వివిధ కళలను నేర్పించడం లో ముందుండేది.

దుర్గాబాయి పన్నెండేళ్ల వయసులోనే స్వాతంత్రోద్య మంలో ప్రవేశించారు.ఎన్నో నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నారు.చదువు పట్ల ఆమెకు మక్కువ ఎక్కువ.అమే కు చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఉండటం తో ఐదవ తరగతి లో ఆగిపోయిన చదువును 25 సంవత్సరాల తరువాత గోరా గారి వద్ద చదివి ప్రైవేట్ గా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్ లేషన్ ,ఇంటర్ పూర్తి చేసి అక్కడ బి. ఎ చదవడానికి వీలు కాకపోవటం తో ఆంధ్రా విశ్వ విద్యాలయం లో చదివి ప్రథమ శ్రేణిలో విజయం సాధించారు. మద్రాస్ లా  కళాశాల లో చదివి న్యాయశాస్త్ర పట్టా ను పొందారు. ఎం. ఎ  డిగ్రీ ని పూర్తి చేశారు.చదవాలనే తపనతో తాను అనుకున్నది సాధించడంలో ఆమె వెనకడుగు వెయ్యలేదు. 

ధైర్య సాహసాలకు ఆమె పెట్టింది పేరు.
1923 లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మహాసభ ప్రవేశ ద్వారం వద్ద వాలంటీర్ గా
దుర్గా బాయి ను నియమించారు. టిక్కెట్ లేకుండా లోపలకి ఎవ్వరు వెళ్ళడానికి వీలు లేదు.జవహర్ లాల్ నెహ్రూ   సభ లోకి వెళ్ళడానికి గేట్ వద్ద కు వచ్చారు.ఆయనను టిక్కెట్ అడగటం దానికి ఆయన  లేదనడం తో అక్కడే ఆపేసిన ధైర్య వంతురాలు దుర్గా బాయి.
          
 1927 వ సంవత్సరంలో కోటి రూపాయల నిది సేకరణ నిమిత్తం గాంధీజీ ఆంధ్ర పర్యటనకు
వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి సమీపంలో వున్న సీతా నగరం ఆశ్రమం లో ఆయన ఉన్నారు. దుర్గా బాయి కి ఆణి చివేత గురైన స్త్రీ లంటే ఎంతో ప్రేమ.సంప్రదాయాల
విష వలయం లో చిక్కుకున్న దేవదాసీలు,ముస్లిం మహిళల పట్ల ఆమెకు సానుభూతి వుండేది. వారి ఉద్దరణకు కృషి చెయ్యాలన్న తలంపు తో మహిళల కోసం ప్రత్యేక సమావేశాన్నీ నిర్వహించి
దానిలో గాంధీజీ చేత ప్రసంగం ఇప్పించాలని నిర్ణయించు కొని కాంగ్రెస్ పెద్దలకు తెలియచేసింది. వారు నిది కి ఓ ఐదు వేల రూపాయలు ఇస్తే ఆయనతో ఐదు నిమిషాలు మాట్లాడనిస్తామన్నారు. వారం రోజుల లో ఆమె ఐదు వేల రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని కోరింది. దానితో గాంధీజీ ఆ సభ లో ప్రసంగించక తప్పలేదు. 

ఐదే నిమిషాలు అనుకుంటూనే గంట సేపు గాంధీజీ మాట్లాడారు.ఆయన తన ప్రసంగం లో పేదలకు ధన సహాయం చెయ్యండి అని అడిగారు దానికి స్పదిం చిన దుర్గా బాయి వెంటనే తన గాజులు, నగలు, ఒంటిమీద ఉన్న ఆభరణాలను తీసి ఇవ్వడం జరిగింది. ఆమె చేసిన పని కి గాంధీజీ ఎంతో సంతోషించి స్వయంగా తన కారు లో ఆమె ను ఎక్కించుకొన్నారు.ఆయన ఆంధ్ర పర్యటన లో ఆయన చేసే ప్రసంగా ల్లంన్నింటికి అనువాదం చేసే పనిని ఆమె కు కల్పించారు.ఆ విధంగా  ఆమె ఆయనకు ప్రియ శిష్యురాలు గా  మారారు.గాంధీజీ అనుమతి తో మద్రాస్ లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని రెండేళ్లు జైల్ శి క్ష అనుభవించారు. ఆమె కారాగారం లో ఉన్నపుడు తోటి మహిళా ఖైదీలకు హిందీ భాష ను నేర్పారు.

ఆంధ్ర మహిళ సభ వ్యవస్థాపకురాలుగా ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు.దీనిని 1938 లో చెన్నై నగరంలో ప్రారంభించారు.దీని ద్వారా స్త్రీ జనోద్దరణ కార్యక్రమాలని ఎన్నింటినో నిర్వహిం
చారు. 1946__1952 మధ్య రాజ్యాంగ సభ సభ్యురాలిగా ,1952_1953 లో ప్రణాళిక సంఘ్
సభ్యురాలిగా పనిచేశారు.ఈ  సమయం లోనే నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్.చింతామణి
దే శ్ ముఖ్ ను 1953 జనవరి 23 న వివాహం చేసుకున్నారు.అదే సంవత్సరం లో కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘంఏర్పడింది.ఆ సంస్థ కు ఆమె 10 సంవత్స రాలు ఆధ్య క్ష రాలు గా పని చేసి,దేశ
వ్యాప్తంగా అనేక సేవా, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.1955  లో హైదరాబాద్ లో
ఆంధ్ర మహిళ సభ ను ప్రారంభించారు. ఆమె ఎన్నో సంస్థలను స్థాపించారు.మరెన్నో సంస్థల స్థాపనకు సహకరించారు. సుమారు 23సంస్థలకు ఆమే కారకురాలు. 

దుర్గా బాయి, దేశ్​ముఖ్ దంపతులు తమ ఆస్తినంతటిని సేవా సంస్థలు స్థాపనకు ఉపయోగిం చారు. చిత్తశుద్ది తో సమాజ సేవ చెయ్యడం లో ఆమె స్పూర్తి ప్రదాత గా నిలుస్తారు. రచయిత్రి గా కూడా దుర్గా బాయి కి మంచి గుర్తింపు ఉంది."ది స్టోన్ థ ట్ స్పేక్స్ " అనే గ్రంధం లో ఆంధ్ర మహిళ సభ చరిత్ర ను మొత్తం వ్రాశారు. " చింతామణి మరియు నేనే"  అనే పేరు తో ఆమె అత్మ కథ ను రచించారు. సుప్రసిద్ధ కథకులు నవలా రచయిత ప్రేమచంద్ కథలను తెలుగు భాష లో అను వదించారు. ఆమె కలం నుండి వెలువడిన విలువైన గ్రంధం " భారతం లో సాంఘిక సంక్షేమం" ఎందరో ప్రముఖులు ప్రశంసలు అందుకుంది. మద్రాస్ లో ఆమె న్యాయ వాది గా రాణించింది. 1952 లో ప్రధాని ఆమె ను ప్రణాళిక సంఘ్ సభ్యురాలిగా నియమించారు.ఆ హోదా లో ఆమె సాంఘిక సంక్షేమం కోసం కృషి చేశారు. మహిళలలో చైతన్యం కలగజేయ డానికి ఆమె ఎంతగానో శ్రమించారు. అనాధ మహిళలు ఆర్ధికం గా బలపడటానికి చేతనైన సాయం చేశారు. వితంతువుల పట్ల  ఉన్న వివక్ష ను రూపు మాపడాని కి పూనుకున్నారు.సామాజిక దురాచారాలను వ్యతిరేకించారు. మహిళల అభివృద్ది కి ఎంతగానో పాటుపడ్డారు.

దుర్గా బాయి విద్యా వ్యాప్తి కి చేసిన సేవలను గుర్తించి  భారత ప్రభుత్వం1971 లో "నెహ్రూ లిటరసీ అవార్డు నిచ్చింది.అదే సమయంలో అక్షరాస్యత వ్యాప్తి కి యు నేస్కో అవార్డు ను అందుకున్నారు. 1963లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను స్వీకరించారు.కేంద్ర ప్రభుత్వం  ఆమె చేసిన సేవలను  గుర్తించి ,1975 జనవరి26న పద్మ విభూషణ్ తో సన్మానించింది. సత్ కార్యాలు
చేసే వారికి సత్కారాలు,సన్మానాలు, అవార్డులు రివార్డులు  అందుకోవడం సహజమైన, వాటి కోసం
కాకుండా ,ప్రతిఫలాపేక్ష లేకుండా,కీర్తి ని ఆశించకుండా అమే చేసిన సమాజ సేవ చిర
స్మరనీయం.
    
 స్వాతంత్ర్య సమర యోధురాలు గా,సంఘ్ సేవకురాలు గా,న్యాయవాది గా, రచయిత్రి గా, ప్రణాళిక సంఘ సభ్యురాలిగా,స్వార్థాన్ని పక్కన పెట్టి సమాజం కోసం  శ్రమించారు. సమాజ సేవలో తనదైన ముద్ర కనిపిస్తుంది. ఆమె జీవితం మహిళలందరికీ ఆదర్శం అనడం లో సందేహం లేదు. దుర్గా బాయి 1981మే9   తేదీ న  హైదరాబాదు  లో కన్ను మూశారు. భౌతికంగా ఆమె లేకున్న ఆమె స్థాపించిన సంస్థల ద్వారా నేటికీ కళ్ళెదుట కనిపిస్తున్నారనడంలో సందేహం లేదు.


మహిళలకు  ఆదర్శం..  దుర్గాబాయి జీవితం_harshanews.com

ఆచార్య గిడ్డి వెంకట రమణ
94409 84416 


Post a Comment

0 Comments