అందాల ఇంతి - అవనికే చామంతి

అందాల ఇంతి - అవనికే చామంతి
Image by Alexandra Haynak from Pixabay 


మనసుకొమ్మ భారమైనప్పుడు 
వసంతకోయిలవై వచ్చి
కలతల చిగుళ్ళు మేసి 
యద బరువు తీరుస్తావు

కనురెప్పల మైదానాలపై 
కలల విత్తనాలు జల్లి
కమ్మని నిద్దురను పంటగా ఇస్తావు

ఓటమితో కృంగిపోయి ఉన్నవేళ 
ఓదార్పునిచ్చి ఆలంబనవై నిలిచి
అలవోకగా అద్భుతాలు సాధించే 
పోరాట పటిమనిస్తావు

ఆకలైనవేళ అన్నమౌతావు 
ఆవేదనలో ఆప్తమౌతావు
అలసినవేళ అనురాగమౌతావు 
ఆరాటాలవేళ అందమౌతావు

చివరకు నీకు మాత్రం
నీవు శూన్యమౌతావు
ఇంతకు మించి నీగురించి 
ఏమి చెప్పగలమే ఓ మహిళా ! ఇలలోని కళా !

నిను వర్ణింప శ్రీ"నాధుడికి" సైతం సశేషమే ఓ లేమల్లీ !
ఎందుకంటే.....
 బ్రహ్మ సృష్టికే నీవొక విశేషమే ఓ చిట్టి తల్లీ
అమాస కూడని సామాజిక జాబిల్లీ!
..........................................................................................................


అందాల ఇంతి - అవనికే చామంతి

పద్మ కుమారి పి.
హైదరాబాద్​Post a Comment

0 Comments