కరోనా మొగ్గలు


కరోనా మొగ్గలు_harshanews.com
కరోనా మొగ్గలు 


సంస్కారాన్ని మనం మరిచిపోతే
కరోనాతో కరచాలనం జేసినట్లే
నమస్కారమే సమస్త రోగనివారిణి

విదేశాల్లో ఇప్పుడు విహారమంటేనే
కరోనాతో కరచాలనమ్ జేసినట్టే
పరదేశాలొద్దు పంచారామాలే ముద్దు

కరోనా మాట విన్నప్పుడల్లా
కర్మసిద్దాంతమే దర్శనమిస్తుంది
జన్మజన్మల కర్మఫలం కరోనా

కాలుష్యకోరల్లో చిక్కుకుంటేనే
కరోనా పెనుభూతమై కాటేస్తుంది 
కరోనాను అంతమొందించే 
ఆయుధం పరిశుభ్రత

కరోనాను కడతేర్చితేనే
మానవజాతి మనుగడ పదిలం
కరోనాను కూల్చుదాం 
ప్రాణాలను రక్షిదాం

....................................................................................

ఉప్పరి తిరుమలేష్
96189 61383

Post a Comment

0 Comments