సినారె మొగ్గలు

సినారె మొగ్గలు_harshanews.com
సినారె మొగ్గలు 


కలానికి కులం లేదనీ
సన్మానాలన్నీ కలానివేనన్నావు
కులం కీళ్లు విరిచిన కలం సి.నా.రె ది

విశ్వంభర జ్ఞానపీఠమై కేంద్ర సాహిత్య శిఖరమై
దక్షిణ భారతం నుంచి మేధావుల సభ సభ్యుడైన తొలి కవిరాజు
తెలుగుదనం ఉట్టిపడే నిండైన విగ్రహం సినారె

‘నన్ను దోచుకొందువటే వెన్నెల దొరసాని’ అనే తొలి సినీ గీతమై
దుర్యోధనుడుపై డ్యూయెట్ రాసి
‘చిత్రం భళారే విచిత్ర’ మనిపించారు
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనదని
ఏం రాసినారె..

సామాజిక చైతన్య ప్రబోధమే నీ కవితా లక్ష్యమై
నవ్వని పువ్వై అలలెత్తే అడుగులై  నింగి కెగిరిన చెట్టైనావు
జీవితానికి రుతుచక్రం మట్టి మనిషి ఆకాశం సినారె

‘గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయంటూ’
‘రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్ హైదరాబాద్’ అంతా తిప్పాడు
గజల్ రాసిపాడిన పామరుల పండితుడు సినారె.

.......................................................................


సినారె మొగ్గలు_harshanews.com

అతినారపు హరిశంకర్
లట్టుపల్లి, నాగర్ కర్నూల్
88863 63249. 

Post a Comment

0 Comments