పీవీ మొగ్గలు

పీవీ మొగ్గలు
పీవీ మొగ్గలు
           
పాములపర్తి తేజోమూర్తిగా ప్రస్థానం సాగిస్తూ
తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవేదికపై చాటాడు 
దక్షిణభారత తొలిప్రధానిగా ప్రఖ్యాతిగాంచిన పీవీ.

మైనారిటీ ప్రభుత్వానికి గగనమై నేతృత్వం వహిస్తూ
వ్యూహాత్మకంగా ఆటుపోట్లను అధికమించిన ఘనుడు
రాజనీతి చాకచక్యానికి నిదర్శనమైన ధీశాలి పీవీ.

భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో
సంస్కరణలకు బీజంవేసి దేశాన్ని గాడిన పెట్టాడు
దేశగౌరవాన్ని కాపాడిన అపరచాణక్యుడు పీవీ.

భాషలకే భాషనేర్పిన జ్ఞానవారధిగా కీర్తి పొందుతూ
సాహితీస్రవంతిలో పేరెన్నికగన్న రచనలు చేసిన దిట్ట
బాహుభాష కోవిదుడైన విజ్ఞాన దురంధరుడు పీవీ.

సామాన్య స్థాయి నుండి అసామాన్యుడిగాఎదిగుతూ
దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన ధీరకృషీవలుడు
అమూల్యమైన సేవలనందించిన దేశబాంధవుడు పీవీ.

భారతజాతిని కాపాడిన తెలంగాణ సూర్యుడై
చలువవెన్నెల కురిపించిన వెలుగుల వజ్రసూచి
భారతదేశ ప్రజల హృదయాల్లో చెరగని ఠీవీ పీవీ.
......................................................................................................
పీవీ మొగ్గలు

కొలిపాక శ్రీనివాస్
98665 14972

Post a Comment

0 Comments