మౌనరోధన


మౌనరోధన_harshanews.com
మౌనరోధన 


మనసెందుకో
మౌనంగానే
లోలోపల రోదిస్తుంది

రోజురోజుకు మనుషులు
తమకుతామే విచక్షణ మరచి
విచ్ఛలవిడితనాన్ని చూపుతుండ్రు

పెనుతుఫానులా
ధరణిపై దావాణంలా
కనిపించకుండా దహనం చేస్తుంది
కరోనా కాలనాగు విషాగ్నులు కుమ్మరిస్తూ
మరణమృదంగం మోగిస్తుంది

పీల్చేగాలిలో జీవనం చేస్తూ
మానవ జీవనగమనంలో
భవిష్యత్తో పీడకలై
నడిసంద్రంలో అలజడిలా
నరకయాతనచూపి బతికున్నప్పుడే 
జీవితాలను బలిస్తున్నది

లోకంలో
మనిషితీరు మారడంలేదు
కాటేసే కరోనా జోరు ఆగడంలేదు

భయమేస్తోంది
కరోనాకంటే కూడా
భాద్యతెరగని జనాన్ని
వారిలో నిర్లక్ష్యపు ధైర్యాన్నిచూసి

ఏంజరిగినా మనకేమి
కడపదాటితే
మనకుమనమే దిక్కుతోచని దీనస్థితిలోకి
జారుకుంటామందరం

మందులేని మాయరోగం
కరోనాకు కళ్ళెమెవడేస్తడోనని
జగతంతా ఎదురుచూస్తున్నరు
శ్మశానాలన్నీ సస్యశ్యామలంగా
రోజుకోవేడుకై వెలుగులీనుతున్నాయ్
భయంగానే

స్థితప్రజ్ఞత కలిగి
విచక్షణనెరిగి
వివేకమెరిగి
కరోనా భూతాన్ని తరిమి
వర్తమాన వీరుడుగా విజయాన్నందుకో..
జగతిని రక్షించుకో
భవిష్యత్తును నిర్మించుకో...

.....................................................................

సి.శేఖర్(సియస్సార్),
తెలుగు భాషోపాద్యాయులు,
పాలమూరు,
9010480557.

Post a Comment

0 Comments