నా కవిత సమాజ చైతన్య గీతిక

నా కవిత సమాజ చైతన్య గీతిక_harshanews.com
నా కవిత సమాజ చైతన్య గీతిక సమాజ లోపాలనుసరిచేసి 
సమాజాన్ని చైతన్యపరిచే 
చైతన్యగీతికై 
మూఢనమ్మకాలను 
ఆమడదూరం చేసే 
మంత్రదండమై 
సమసమాజ స్థాపనకై 
నినదించే ప్రజా గొంతుక నాకవిత

అవినీతి అక్రమాలను 
అంతుచూసే అక్షరాస్త్రామై 
నీతి నిజాయితీకి పట్టంకట్టే 
వజ్రసింహాసనమై 
అభ్యుదయభావాలను 
అవనికి అందించే 
విప్లవ జ్యోతి నా కవిత

ఆత్మీయత అనురాగాలను 
ధాత్రికి ధారపోసే 
మరో జననిగా 
బరువు బాధ్యతలను గుర్తుచేసి
బ్రతుక్కి బంగారు దారి చూపే 
కన్నతండ్రిగా 
సూదూరమవుతున్న 
బంధాలను కలిపే 
ఆత్మబంధువు నాకవిత

తెలియని విషయాలను 
అణ్వేషించి తెలిపే 
నిత్యాణ్వేషిగా
గమనం తెలిక 
అంధకారం అలిమినప్పుడు 
లక్ష్యానికి దారి చూపే 
మార్గదర్శిగా 
లోకానికి విజ్ఞానాన్ని 
అందించే బహుముఖ 
విజ్ఞానబండాగారం నా కవిత

మనఃకుహురంలో 
దాగిఉన్న ప్రతిభను 
వెలికితీసే ఉపాధ్యాయిగా 
కులమత అంతరాలు లేని 
కలల ప్రపంచ నిర్మాతగా 
దేశ భక్తిని ప్రజ్వలించి 
జాతిని ఐక్యం చేసే 
మరో జాతిపిత నా కవిత

.......................................................................

డి.అమీర్
కొమ్మేమర్రి గ్రామం,
ప్యాపిలిమండలం,
కర్నూలు జిల్లా
96424 80702

Post a Comment

0 Comments