ప్రేమ మొగ్గలు

ప్రేమ మొగ్గలు_harshanews.com
ప్రేమ మొగ్గలు ఇరువురి మదిలోని భావాలు 
లతలా  పెనవేసుకొంటేనే
పచ్చని, నులివెచ్చని
ప్రేమ మొలకలు పుట్టుకొచ్చేది
నదీ నదాల పవిత్ర సంగమ క్షేత్రం 
'అర్థాంగి ' ప్రేమ

మగువ హృదిలో 
మధుర జ్ఞాపకాలు పంచుకొంటేనే
మనసు స్పందించి 
రసజ్ఞత పాలులా పొంగి పొర్లేది 
కోవెలలో నిత్యం వెలిగే 
పవిత్రమైన దీపం 'చెలియ' ప్రేమ

కష్టాల కడలిలో 
మునుగుతున్న స్నేహాన్ని 
ఒడ్డున చేరిస్తేనే
నమ్మకమనే ప్రేమ నావ 
అనునిత్యం ప్రయాణం చేసేది
కడవరకు స్నేహ బంధాలను నిలిపేది
'చెలిమి' ప్రేమ

పొత్తిళ్ళలలో నవమోసాలు మోసి
శిశువును ప్రసవిస్తేనే
అమ్మ కళ్ళ ల్లో 
కోటి కాంతి కిరణాలు ప్రసరించేది
సృష్టిలో అనిర్వచనీయమైనది 
 'అమ్మ ' ప్రేమ

......................................................................................

కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి
9441791239

Post a Comment

0 Comments