వలస పక్షులు

వలస  పక్షులు_harshanews.com
వలస  పక్షులు 


తిండి గింజలు కోసం
వలస పక్షుల అన్వే షణ 
ఎక్కడికైనా పోతాయి
బతికే మార్గం కోసం చూస్తాయి

దిక్కు లేని పక్షులవి
దిగాలుగానే ఉంటాయి
దిగులుతోనే ఉంటాయి

తిండి దొరుకుతుందంటే చాలు
రెక్కలు కట్టుకుని పోతాయి
రెక్కలు ముక్కలు చేసుకుంటాయి
పొట్ట నింపు కుంటాయి

వెనకేసుకునేదేది లేదు
బాగుపడి ముందుకు పోలేదు
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ఎక్కడున్నా వలస పక్షులన్నీ ఒక్కటే

సర్కార్ ఏదైనా కష్టాలు తప్పవు
ప్రభుత్వాలు మారిన సమస్యలు పోవు
బతుకులు దారం లేని పతంగులే
చమురు  లేని   దీపాలే

కరోనాతో మొదలైన కష్టాలు
ఎంత కాలముంటాయే తెలియదు
ముందు నుయ్యి వెనక గొయ్యి
ఎవరు అందివ్వరు చెయ్యి

కరోనా అంటుకుంటే
బతుకే ఖతం అవుతుంది
పాలకుల్లారా ఆలోచించండి
వాళ్ళు కూడా ఓటర్లే
వాళ్ళ మీద దృష్టి పెట్టండి
కరోనా కష్టాల నుండి తప్పించండి
చేయూత నివ్వండి
కాళ్ళ మీద నిలబడతారు
బతికి బట్ట కడతారు
............................................................................................................
ఆచార్య గిడ్డి వెంకట రమణ
94409 84416

Post a Comment

0 Comments