సరిహద్దు సేవకులు

సరిహద్దు సేవకులు_harshanews.com
సరిహద్దు సేవకులు 


భారత మాత ఒడిలో జన్మించిన పులిబిడ్డలు
సువిశాలమైన భారత సంరక్షణకై
సైన్యమై,రక్షణై  సరిహద్దున నిలబడి
సమరంలో ప్రాణత్యాగం చేసే 
అమరులారా వందనం

            దేశరక్షనే మీరు ధ్యేయంగా ఎంచుకుని
            శాంతిభద్రతల మీరు భాద్యతలు పంచుకోని
            కంటి పాపాల మీరు కపడేవీరులు

నేను నాదేశం అంటూ దేశభక్తి పెంచుకొని
క్షణక్షణం అనుక్షణం దేశాన్ని రక్షించి
శత్రువులను చండాడే శూరులై
జాతి రక్షణ కాపాడే వీరులై

            మీ ప్రాణాన్ని  పణంగా పెట్టి
            ఉన్న ఊరుని విడిచి,కన్నవారిని  విడిచి
            సమాజానికి దూరమై,సైన్యానికి చేరువై
            కులమత భేదం విడిచి,భాష ద్వేషం మరచి

క్రమశిక్షణ అలవర్చుకొని,ధైర్య సాహసం నింపుకొని
నూరేళ్ళ మీ జీవితం ,జాతిసేవాక్  అంకితం
ఎగిరే జాతిపథకం,మీ ఒంటిపై అది కవచం
ఆయుధాలు ధరించి అప్రమతులై మీరు

            త్యాగానికి సిద్ధపడి,సరిహద్దున నిలబడి
            మీ సేవలు భారత జాతి మరచిపోదు ఎన్నటికీ
            మీ కీర్తి ముమ్మాటికీ తరతరాలకు స్ఫూర్తి
            వందనం వీర సైనిక అభివందనం

..............................................................................................

              
టి.సంయుక్తాకృష్ణమూర్తి
                     M.C.A,M.ED
కరీమబాద్
వరంగల్ జిల్లా 
85001 75459

Post a Comment

0 Comments