సిరాచుక్క

సిరాచుక్క_harshanews.com
సిరాచుక్క 


క్షీరసాగర మథనంలో
తోణికిన ఓ అమృత బిందువు
అలా అలా ఓ సిరాచుక్కగా మారి
నా కలంలో చేరింది.
దీనజనులకు ఓదార్పునిస్తూ
మహిళా సాధికారతకు మద్దతునిస్తూ
పిల్లల విజ్ఞానవ్యాప్తికి ఊతమిస్తూ
పెద్దల ఆలోచనలకు ఆస్కారమిస్తూ

సంస్కరణల దిశగా..
సమన్వయ దృష్టితో ...

చురుకుగా కదిలింది.
కవిత్వాన్ని విరజిమ్మింది.
మధురోహల పల్లకిలో
హాయిగా విహరింపజేసింది.

నా సిరాచుక్కా..
అక్షరాన్ని ఆయుధంగా మలచి
పేదరికాన్ని తుదముట్టిస్తుంది.
ఆలోచనలకు రూపం ఇచ్చి
మేధస్సుకు పదునుపెడుతుంది.
సమాజ నిర్మాణానికి
పునాది రాయిగా మారుతుంది.
ఘనీభవించిన జ్ఞానంగా
పుస్తకాలలో నిక్షిప్తం అవుతుంది.
........................................................................................

గంజాం భ్రమరాంబ
తిరుపతి
99499 32918

Post a Comment

0 Comments