భావితరాలకు మనమిచ్చే సంపద.. పచ్చని చెట్లు

  • మహబూబాబాద్​జిల్లా ఎస్పీ ఎస్​.కోటిరెడ్డి
  • ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ఇచ్చిన గ్రీన్​ఛాలెంజ్​ స్వీకరణ
  • క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ
భావితరాలకు మనమిచ్చే సంపద.. పచ్చని చెట్లు_harshanews.com
మొక్కను నాటుతున్న ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్​: భావితరాలకు మనమిచ్చే సంపద పచ్చని చెట్లని మహబూబాబాద్​జిల్లా ఎస్పీ ఎస్. కోటిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే శంకర్​నాయక్​ఇచ్చిన గ్రీన్​ఛాలెంజ్​ను ఎస్పీ స్వీకరించారు. శుక్రవారం  క్యాంపు కార్యాలయంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పచ్చని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయన్నారు. పర్యావరణంపై ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. టౌన్​ డీఎస్పీ నరేష్​కుమార్​, రూరల్​ సీఐ వెంకటరత్నం, ఎస్ఐ రమేశ్​బాబులకు గ్రీన్​ ఛాలెంజ్​ విసిరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేష్ కుమార్, సీఐ వెంకటరత్నం, ఏ.వి.రావు , ఎస్.ఐ రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments