మా మనసుల్ని దోచే 'సినారె'...

మా మనసుల్ని దోచే 'సినారె'..._harshanews.com
మా మనసుల్ని దోచే 'సినారె'... 

రచనా ప్రక్రియలన్నీ
పద్మాలై మురిసి ఎగసి
మీ పాదపద్మాలచెంత 
'పద్మశ్రీ'గా విరి 'సినారె' ...

భాగవత రహస్యపు
ముడులను ఒడుపుగా
విప్పి ఆరే 'సినారె'.....

చావు,పుట్టుకల మధ్యన
మనుజలోకానికి కమ్మిన
మాయపొరను తాత్వికతతో 
బహుబాగారా' సినారె'....

విశ్వంభర'తత్వమే
అనంతజీవన సత్యంగా
ఎరుకచే'సినారె'....

ఏటిని చీల్చిన
ఈటెల్లాంటి చేతులే
ఇప్పటి మూర్ఖత్వాలంటూ
స్వార్థాలను అంట కడిగే'సినారె'....

విజేతగా నిలవాలంటే ?
విశ్వాన్నే భస్మంచేయాలా? 
అని రక్తంమరిగిన జాడలుంటాయనే 
నగ్నసత్యాలను 'ఏమిరాసినారె? ....

ఎరుపెక్కిన చీకటి
వెలుగౌతుందా ?
హింస గెలుపౌతుందా ? అంటూ 
ప్రశ్నల బాణాలను సంధిస్తూ 
జగతికి చైతన్యపథాన్ని దర్శింపజే 'సినారె...

జ్ఞాన పీఠమధిరోహించి
ప్రజాహృదయపీఠంపై
చిరంజీవులై  చిరస్థాయిగా
మా మనసుల్ని దోచే 'సినారె....

ఎంత రాసినా వన్నెతరగని
విశేషాలను పొదవిపట్టుకుని 
సాహితీలోకాన ధృవతారగ
'ఎగసినారె...'సినారె'..…

........................................


       
మా మనసుల్ని దోచే 'సినారె'..._harshanews.com

సోంపాక సీత
భద్రాచలం
8639311050 

Post a Comment

0 Comments