పీపీఈ కిట్స్​ను రెగ్యులర్​గా వినియోగించుకోవాలి

  • మంత్రి కేటీఆర్​
  • జీహెచ్​ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్స్​ పంపిణీ
పీపీఈ కిట్స్​ను రెగ్యులర్​గా వినియోగించుకోవాలి
 సిబ్బందికి కిట్స్​ను అందజేస్తున్న మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​: పీపీఈ కిట్స్​ను జీహెచ్​ఎంసీ సిబ్బంది రెగ్యులర్​గా వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. కోవిడ్ -19 నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ శానిటేషన్, ఎంటమాలజీ, డి.ఆర్.ఎఫ్ సిబ్బందికి మంత్రి  పీపీఈ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రస్తుతం రూ.13 కోట్ల వ్యయంతో 22 వేల మంది శానిటేషన్, 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ సేఫ్టీ కిట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జీ సిబ్బంది సేవ‌ల‌ను గుర్తించి ప్రభుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, రక్షణతో పాటు కుటుంబ స‌భ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి ఇంటి వ‌ద్ద కూడా త‌గు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సిబ్బందికి సూచించారు. 

Post a Comment

0 Comments