సామాజిక వ్యాప్తి... ఒక ప్రళయం

సామాజిక వ్యాప్తి... ఒక ప్రళయం_harshanews.com
సామాజిక వ్యాప్తి... ఒక ప్రళయం 


సేఫ్ జోన్లు, రెడ్ జోన్లుగా
రెడ్ జోన్లు, కంటోన్మెంట్ జోన్లుగా
ఆ కంటోన్మెంట్ జోన్లు
ఇమ్యూనిటీ కొరబడిన
కమ్యూనిటీట్రాన్స్ మిషన్లుగా మారితే
ఇక ప్రపంచమంతా ప్రళయమే
కరోనా విషవలయమే, విలయతాండవమే

ఆ దశలో కరోనా రక్కసిని
కంట్రోల్ చెయ్యడం కాదెవరితరం
కంటికి కనిపించని ఆ కరోనా
కళ్ళేలులేని గుర్రంలా పరుగులు తీస్తుంది

హద్దూ అదుపూలేని ఆ కరోనా వైరస్
అడవిని దహించే కారుచిచ్చులా
విశ్వమంతా విస్తరిస్తుంది
అల్లకల్లోలం సృష్టిస్తుంది

ప్రజలు కళ్ళముందే పిట్టల్లాగ రాలిపోతారు
లక్షలాదిమందిని కరోనా పొట్టన పెట్టుకుంటుంది

అతి ప్రమాదకరమైన మూడవ దశ
మృత్యువు మృదంగనాదం వినిపించే విషాద దశ

ఆ దశే వస్తే,మనం
బ్రద్దలయ్యే అగ్నిపర్వతం అంచున వున్నట్లే
మనకు అనంత ప్రళయం దాపురించినట్లే

ఆ దశే వస్తే, మనం
హోరుగాలిలో జోరువానలో నడిసంద్రంలో వున్నట్లే
విద్వంసాన్ని సృష్టించే సునామీ విరుచుకు పడినట్లే

ఆ దశే వస్తే, మనం
బుసలు కొట్టే విషసర్పం పడగనీడలో నిదురిస్తున్నట్లే
మన ముందరే మృత్యువు కరాళ నృత్యం చేస్తున్నట్లే
        ఆ క్లిష్టపరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి
        నిస్వార్థంగా సేవలుచేసే 
        ప్రాణదాతల చేతులు కట్టేసినట్లే

కారణం,
నియంత్రణంటూ లేక నిర్లక్ష్యం వహించినవారికి
నూకలు చెల్లినట్లే, నిండూ నూరేళ్ళు నిండినట్లే
ఇదే సామాజిక వ్యాప్తిలో 
కరోనా చేసే విలయతాండవం, 
రానున్న ప్రళయం
తస్మాత్ జాగ్రత్త...
మిత్రులారా...తస్మాత్ జాగ్రత్త 

....................................................................


పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్, హైదర్ గూడా 
హైదరాబాద్
91107 84502 

Post a Comment

0 Comments