కవితా ప్రస్థానం - సమాజచైతన్య బాణం

కవితా ప్రస్థానం - సమాజచైతన్య బాణం _harshnanews.com
కవితా ప్రస్థానం - సమాజచైతన్య బాణం 

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది.  తెలుగు సాహిత్యము సమాజమందలి అసమానతలను తొలగించడంలో జగతిని జాగృతం చేయుటలో విశేష ప్రాముఖ్యత కలది. ఈవిధంగా తెలుగు సాహిత్యం ఎన్నో ప్రక్రియలలో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది.ఆ ప్రక్రియలలో వచన కవిత ఒకటి.  అటువంటి వచన కవిత్వాన్ని ఎంచుకొని కలం అనే హాలాన్ని చేతబట్టి అక్షరాలనే విత్తులతో  సమాజ శ్రేయస్సుకు కవితా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన డా.యం.రాములుగారు ఏంతో హార్షనీయుడు. విశ్రాంత ఉపాధ్యాయుడిగా తన జీవిత అనుభవంలో ఎదురైన ఎన్నో సమస్యలను ప్రస్తుత పాశ్చాత్యకాలంలో ఎదురవుతున్న సమస్యలపై సమాజ హితాన్ని కోరుతూ జన చైతన్యమే విధిగా డా.యం.రాములుగారు సంధించిన బాణమే ఈ కవితా ప్రస్థానం.

ఈ కవితా ప్రస్థానంలో..

"ప్రస్తుత లోకాన్ని పీడుస్తున్న కరోనా గూర్చి మానివాళి గ్రహాచారం భాగలేక  కరోనా శని గ్రహాణం పట్టిందని మనిషి బ్రతుకు దినదిన గండంగా మారిందని చాలా చక్కగా వర్ణించారు."
 
"కరోనా రాకతో విద్యార్థుల  చదువులు అటకెక్కాయని అన్ని కార్యాలు కట్టిపెడితిమి పూట గడవక ఇబ్బంది పడితిమి నీ రాక మాకు గండం నీకెప్పుడు యమగండం అంటూ కరోనాపై విమర్శనాత్మక బాణం వదిలాడు" "సంప్రదాయ రక్షణ కవితలో పాత ఆచారాలకు పాతరేసి కొత్తవాటికి పునాదివేసి రోగాల రొంపిలో మనిషి అస్తిత్వమే ప్రశ్నార్థకం అంటూ మన సంప్రదాయల విలువను తెలిపారు.’’
 
"విదేశీ కంపెనీలకు వింజామరలు ఆపేసి స్వదేశీకి పట్టంకడితే ఆర్థిక వ్యవస్థ గాడిన పడదా సమస్తం దాసోహమవ్వదా అంటూ జన జాగృత పరిచారు." "వెనకేసుకున్న సొమ్ము వెంటరాదని తెలిసి అవినీతి సొమ్ముకై అర్రులుచాచి అపకీర్తి పొందేరు ఇకనైన మారరా అంటూ సరైన ప్రశ్న కవితాస్త్రాన్ని మానవాళిపై ఎక్కుపెట్టాడు."

"అమోఘమైన ఆయుధసంపత్తి సంగ్రామంలో పోరాడే కండబలం గుండెబలం గల సైనికశక్తే దేశానికి శ్రీరామరక్ష అని సైనికులే మన సంరక్షకులని చక్కగా కవితలో విశ్లేషించారు"
"విభిన్న సంస్కృతుల మేళవింపు ఇతిహాసాల పుట్టినిల్లు వేదాలు వెలిసిన పుణ్యభూమి కళలకు కాణాచి నా జన్మభూమి అని దేశభక్తిని చాటారు డా. రాములు గారు."

"పేద ధనిక భేదాలు కులమత అంతరాలు చూడక కలసిమెలసి ఆడుకున్న బాల్యస్నేహమే అద్భుతం అని స్నేహగాడతను తెలిపారు" "అజ్ఞానాంధకారాన్ని  పోగొట్టి విద్యార్థుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించి పాత్రదారుల్ని సమాజ సూత్రధారులుగా మలిచే విజ్ఞానభాండగారాలని ఒక గురువుగా డా.యం.రాములు గారు  గురువులకి కవితలో అగ్రతాంబూలం వేశారు."

"ఇంటికి దీపం ఇల్లాలు ఆత్మీయత అనురాగానికి ప్రేమాభామానాలకు నిలువెత్తు రూపం ఆమే సేవలు అనిర్వచనీయమని సేవమూర్తి ఇల్లాలు గొప్పతనాన్ని కవితలో వర్ణించి తాను స్త్రీమూర్తి సేవకుడినని చాటుకున్న స్త్రీవాద కవి డా.యం.రాములు గారు"

ఈవిధంగా ఈ కవితా ప్రస్థానంలో  డా. యం.రాములు గారు రాసిన ప్రతి కవిత ఒక ఆణిముత్యంగా సమాజ హితాన్ని కోరేదిగా వర్తమాన, భవిష్యత్తుకాలాలను ప్రభావితం  చేసేదిగా, యూవతరానికి మార్గదర్శకంగా ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు

డా.యం.రాములుగారి కలం నుండి కవితా ప్రస్థానం కవిత సంపుటే కాక రామభాషితాలు, సిసింద్రుల కథలు, పాలమూరు చరిత్ర-సంస్కృతి, సక్సెస్ పుల్ టీచర్ ,జ్ఞాపకశక్తి పెరగాలంటే లాంటి ఏన్నో గ్రంథాలను రచించి సమసమాజ నిర్మాణానికి తన వంతు సహాకారం అందించి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రులు రామారావు, చంద్రబాబునాయుడితో మరియు ఎన్నో సత్కారాలు సన్మానాలు పొందారు.

డా.యం. రాములు గారి రచనల పరంపర ఇలాగే సాగుతూ కలంలోని సిరా ఇంకేదాక సమాజ కొవ్వు కరిగి సమాజచైతన్యం జరగేదాక  రాస్తూనే ఉండాలని ఎన్నో సాహితి సత్కారాలు వరించాలని ఆశిస్తూ...అభినందనలతో అక్షరాస్త్రమాల...

                         
కవితా ప్రస్థానం - సమాజచైతన్య బాణం _harshnanews.com

సమీక్షకులు
 దూదేకుల అమీర్ భాష,
కొమ్మేమర్రి,
ప్యాపిలి మండలం,
 కర్నూలుజిల్లా.
964248 0702

 

Post a Comment

0 Comments