ఓపిక ఉన్నంత వరకు వైద్యసేవలోనే..

ఓపిక ఉన్నంత వరకు వైద్యసేవలోనే.._harshanews.com
ఓపిక ఉన్నంత వరకు వైద్యసేవలోనే..

ఆమెను డాక్టర్ గా చూడాలనుకున్న తండ్రి కోరిక నిజమైంది. దశాబ్దాలుగా వేలాది మంది తల్లులు తమ బిడ్డలను ఆమె చేతుల మీదుగా అందుకుంటున్నారు. హస్తవాసి ఉన్న డాక్టర్ గానే కాదు ఉచితవైద్యం అందించే మనసున్న డాక్టర్ గా ఆమె గుర్తింపు పొందారు. కన్ను మూసే వరకు ప్రాణాలు పోయాల్సిందే అంటూ చెప్పే ఆమెకు లేబర్ రూమ్ (ప్రసూతి గది) పవిత్ర దేవాలయం. ఎందుకంటే మనిషిని ఈ లోకంలోకి తీసుకువచ్చేది ఇదే కదా అంటారు. ఆమె డాక్టర్ పర్చా అంజనీ దేవి. 

వరంగల్ లోని కళ్యాణి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్.  ఆరు పదుల వయసులో ఆమె డ్రాయింగ్ పరీక్షలో పాస్ అయ్యారు. ఈత నేర్చుకున్నారు. కార్టూన్స్ గీయడం నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే జీవితంలో ఎప్పుడైనా నేర్చుకోవచ్చుఅంటారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ఆమె అందిస్తున్న వైద్యసేవలు అభినందనీయం.
ఈ రోజు ఆమెకు 75వపుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ సందర్భంగా ఆమె పరిచయం..


పూర్తి పేరు :   డాక్టర్ పర్చా అంజనీ దేవి
పుట్టిన తేదీ :  30-7-1945
తల్లిదండ్రులు:  కొమరగిరి సుగుణ, కొమరగిరి అప్పారావు
భర్త పిల్లలు :  పర్చా కోదండ రామారావు, డాక్టర్ చేతన్( కోడలు డాక్టర్ రేఖ) డాక్టర్ వినూత్న (అల్లుడు డాక్టర్ గోపాలకృష్ణ), స్పందన (అల్లుడు రమణ కుమార్ , గ్రూప్ కెప్టెన్ ఎయిర్ ఫోర్స్)
విద్యార్హతలు :   ఎంబిబిఎస్
మీ ఉద్యోగ వివరాలు :  గవర్నమెంట్ సివిల్  అసిస్టెంట్ సర్జన్ గా 14 ఏండ్లు, స్త్రీ వైద్యనిపుణురాలిగా 50ఏండ్లుగా పనిచేస్తున్నాను.  వరంగల్ లోని కళ్యాణి హాస్పిటల్ ఎండిగా ఉన్నాను
ప్రవృత్తి :   చాక్ పీస్ తో అందమైన శిల్పాలు చెక్కడం, కథలు రాయడం,
హాబీలు :   సంగీతం వినడం, సాహిత్యసభలకు వెళ్ళడం, 60ఏండ్లు వచ్చాక డ్రాయింగ్ పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాను. ఆరు పదులు దాటాక స్మిమ్మింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడిప్పుడే కార్టూన్స్ వేయడం నేర్చుకుంటున్నాను.
లక్ష్యం :  కిశోర బాలికలకు, మహిళలు వీలైనంత వరకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం. ఓపిక ఉన్నంత వరకు తల్లిబిడ్డల ప్రాణాలు కాపాడటం

ఓపిక ఉన్నంత వరకు వైద్యసేవలోనే.._harshanews.com
అంజనీదేవికి అవార్డును అందిస్తున్న మంత్రులు
వైద్యరంగంలో, సామాజిక సేవారంగంలో అందిస్తున్న సేవలకు అనేక సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. 

Post a Comment

0 Comments