నేటి కవిత్వం

నేటి కవిత్వం_harshanews.com
నేటి కవిత్వం 

 
కవిత్వ లక్ష్యం
నేడు సమాజహితం ఏమీ కాదు
కవిత్వం కూడా నేడు కాలుష్యమే!

నేడు కవిత్వం
స్వార్థపరుల చేతుల్లో బంధీ
వర్గపోరాటాలకు
కులకొట్లాటలకు
మతమారణ హోమాలకు
ఆజ్యం పోసేది నేటి కవిత్వం!
ప్రచారార్భాటాలకు సాధనం
నేటి కవిత్వం!

తను పట్టిన కుందేలుకు
మూడే కాళ్ళు అని వాదించేది
నేటి కవిత్వం!

నేలవిడిచి సాము చేసేది 
నేటి కవిత్వం!

కవిత్వం నేడొక వ్యాపారం
అవార్డుల కొరకై పరుగులు తీసేది
నేటి కవిత్వం!

పుస్తకాల ప్రచురణకై
చందాల సేకరణే
నేటి కవిత్వ లక్ష్యం!

సత్యాన్ని మరుగు పరిచేది
నేటి కవిత్వం!

సమాజంలో అల్లకల్లోలం
సృష్టించేది నేటి కవిత్వం!

ప్రశాంత జీవనాన్ని
అశాంతిమయం చేయడమే
నేటి కవిత్వ ప్రయోజనం!
కవిత్వం జగత్ హితం అన్న
నన్నయ పలుకులు ఏనాడో
మరచిపోయింది నేటి కవిత్వం!

ప్రక్రియ ఏదైనా ప్రయోజనం శూన్యం!
ప్రక్రియ ఏదైనా సొంత డబ్బా
వాయించు కోగలను అని చాటడమే
నేటికవిత్వం!

అధికార్ల అనధికార్ల నాయకుల
చుట్టూ ప్రదక్షిణాలు చేసేది
నేటి కవిత్వం!

జాతీయతను మరచి
అంతర్జాతీయతకై అర్రులు
చాచేది నేటి కవిత్వం!

సామాన్యుడిని గంధరగోళం లోకి
నేట్టేది నేటి కవిత్వం!

వాట్సాప్; ఫేస్ బుక్ల చుట్టూ
పరుగులు తీసేది నేటి కవిత్వం!

అందుకే నేటి కవిత్వ ప్రయోజనం శూన్యం!
....................................................

డా. వెలుదండ వేంకటేశ్వరరావు
మహబూబ్ నగర్.
87904 21061

Post a Comment

0 Comments