సాహితీ ప్రియుడు వెంకయ్య నాయుడు

సాహితీ ప్రియుడు  వెంకయ్య నాయుడు_harshanews.com
సాహితీ ప్రియుడు  వెంకయ్య నాయుడు 


నెల్లూరు జిల్లాలో
ఉదయించిన
ధైర్యం పట్టుదల కలిగిన
అపర చాణక్యుడు

వ్యవసాయ కుటుంబంలో 
జన్మించి
అణగారిన వర్గాల అభివృద్ధికై
అలుపెరగని పోరాటం చేసిన
ప్రతిభా ప్రభాకరుడు
బహుభాషా కోవిదుడు

ఆయన జీవితం
చైతన్య పతాకం
సకల జన శ్రేయోభిలాషి
దైవ భక్తి దేశ భక్తి కలిగిన
గొప్ప వాగ్దాటి
మానవతా మూర్తి

నిర్మలమైన మనసు కలిగినన
విజ్ఞాన వేత్త విద్యా ప్రదాత
రాజకీయవేత్త
భారతీయ జనతా పార్టీకి
కీలక నేత

న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన
జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు
స్వయంకృషితో ప్రకాశించిన
ఆంధ్ర కమలనాథుడు
రాజకీయ దురంధరుడు
తెలుగు భాషకు వెలుగై
నిలిచెను ముప్పవరపు వెంకయ్య నాయుడు
..........................................................................

సాహితీ ప్రియుడు  వెంకయ్య నాయుడు_harshanews.com

డా.తెలుగు తిరుమలేష్
తెరసం జిల్లా అధ్యక్షులు
అమరచింత మండలం
వనపర్తి జిల్లా
99089 10398 


       

Post a Comment

0 Comments