జాగృతం

జాగృతం_harshanews.com
జాగృతం 
ఉదయభానుని  చూడరా!

ఉత్సాహవంతుడవు కావాలిరా!
విహరించే  విహంగాలు చూడరా!
విధి నిర్వహణ చేయరా!
అవిశ్రాంత కృషి చేయరా!
నీ బ్రతుకు బంగారు బాటరా
లేవరా! లే! జాగృతం కా!
                 
నిర్లక్ష్యం వీడకపోతే  నిందలు తప్పవురా
అశ్రద్ధ మానకపోతే  భవిత లేదు రా
బద్ధకం వదవకపోతే  బాధలు ఎక్కువ రా
లేవరా! లే! జాగృతం కా!
బాధ్యతలు గుర్తెరగనిదే 
భవిష్యత్తు  లేదు రా!
                  
చదువుకోకపోతే  తిప్పలు తప్పవురా
గిరగిర తిరిగే కాల చక్రం చూడ రా
బ్రతుకు గతించుతోంది రా!
దినం దినం మారిపోతోంది రా!
తిరిగి చూస్తే సూన్యం రా
పోటీ ప్రపంచంలో బ్రతకనేర్వరా
నీలో ఉన్న అంతర్గత మేధస్సును
తట్టిలేపరా!

స్పూర్తిదాతల చిత్రపటములు చూడరా
లేవరా! లే! జాగృతంకా.....
నీకో ఉనికిని సంపాదించి నిలబెట్టుకో
నువ్వు మానసిక రుగ్మతలు త్యజించి
నీలో ప్రతిభా చైతన్యాలను మేల్కొలుపు
నీవు సైతం ప్రగతిపథంలో నడవగలవని
నిరూపించుకో...
లేవరా! లే! 
జాగృతం కాగలవు! లే!...

.....................................................................

విశ్వశ్రీ, సాహిత్యశ్రీ 
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము
98496 92414


Post a Comment

0 Comments