ఆరోగ్యంగా ఉంటేనే పూర్ణాయుష్షు

ఆరోగ్యంగా ఉంటేనే పూర్ణాయుష్షు
Image by Messan Edoh from Pixabay 


ఆరోగ్యంగా ఉంటేనే పూర్ణాయుష్షు
అది లేకుంటే కలుగును  అల్పా యుష్షు
           ఆరోగ్య సౌభాగ్యమే నీకు తోడైతే
            ప్రతిరోజూ చూడగలవు అందమైన ఉషస్సు
                                                                    !!ఆరోగ్యం!!

ఆరోగ్యవంతుని ముఖమంతా తేజస్సు
దినదినము పెరుగుతుంది ముఖవర్చస్సు
దాన్ని కాపాడుకోవాలని చేయరా తపస్సు
ఆ దేవుడు అందిస్తాడు నీకు ఆశీస్సు
       ఆరోగ్య సౌభాగ్యమున్నవారికే
       దొరుకుతుంది అందమైన భవిష్యత్తు
                                                        !!ఆరోగ్యం!!

స్వచ్ఛమైన పరిసరాలు నీ చుట్టూ ఉంటే
శుభ్రమైన ఆహారపు అలవాట్లు నీకుంటే
తలుపు తట్టి పిలుస్తోంది ఆరోగ్యమూ
పెంచుతుంది అనుదినము నీ ఆనందమూ
          ఆరోగ్య సౌభాగ్య ఉన్నవారికే
          ఎదురవుతుంది అందమైన భవిష్యత్తు. 
                                                           !!ఆరోగ్యం!!

జపము లెన్ని చేసినా దొరకనిదీ ఆరోగ్యం
తపము లెన్ని చేసినా అందనిదీ ఆరోగ్యం
పరిశుభ్రత తోనే దొరుకుతుంది నీకు
పదికాలాల అందమైన బ్రతుకు నే ఇస్తుంది
               ఆరోగ్యం ఎక్కిస్తుంది నిన్ను అందలం
               నీ బ్రతుకే అవుతోంది నిత్య సుందరం
                                                               !!ఆరోగ్యం!!

.............................................................................................

ఆరోగ్యంగా ఉంటేనే పూర్ణాయుష్షు

రమాదేవి బుక్కపట్నం 
దిల్ సుఖ్ నగర్
98495 96053

 
Post a Comment

0 Comments