అంటరాని...కరోనా

అంటరాని...కరోనా
Image by cromaconceptovisual from Pixabay 

అంటరాని వాన్నని
నీకు చదువెందుకంటూ
ఆనాడు..ఆమడ దూరంగా
నన్ను నెట్టేశావు ..
అయినా.. నీకిప్పుడు
డాక్టర్ హోదాలో
సేవలందిస్తున్నాను..!

కరోనా కౌగిలింతతో
కాటికి కాలుచాచిన
నీ వెంటిప్పుడు
నీభార్యా పిల్లలెవరూ
చూడ్డానికి కూడా రారనే
సత్యాన్ని గ్రహించావు..!

నీవు పైకి పోతే
కాష్టంలో నిన్ను
కాల్చడానికి... కూడా
మళ్లీ నేనే కావాలనే
నిజాన్ని మరిచిపోతున్నావు..!

వారెవ్వా... "కరోనా"..
కుల మతాల
జాడ్యంలో కొట్టుకుంట్టున్న
కుహానా కుల వాదులకు
ప్రాణం మీద తీపి..భయం
అందరికీ ఒక్కటేనని
నిరూపించావు..!

మూడు అడుగుల
దూరాన్ని పాటించకపోతే
ఆరడుగుల గోతిలో
శాశ్వతంగా ..
పడుకోబెడుతున్నావు ..!

ఈ వాస్తవాన్ని నిరూపిస్తూ
నాకన్నా గొప్పెవరని
విర్రవీగిన నాయాళ్లకు
కనిపించకుండానే..
కాటికి పంపుతున్నావు ..!

నీ దెబ్బకైనా.. నా దేశంలో
అంతరాలు అంతమౌతాయో ?
లేక.. మళ్లీ నీవెళ్ళిపోయాక
షురూ అవ్తాయో?..చూద్దాం ..!!

( ఈ ఆపత్కాలంలో గుర్తుకు
రాని "అంటరాని తనం".. అన్నీ
సర్డుకున్నాక.. షరామామూలే..
మోనన్న సందేహంతో....)
........................................................................................
అంటరాని...కరోనా

రవి చంచల
పాలమూరు
85003 30700  


Post a Comment

0 Comments