అమ్మ మొగ్గలు

అమ్మ మొగ్గలు_harshanews.com
అమ్మ మొగ్గలు 


కంపచెట్ల ముళ్ళు 
కందిరీగలకాట్లెన్ని పడినా
మక్కాపరిగెకంకవుతూ నవ్వేది అమ్మ
అమ్మంటే సుఖదుఃఖాలను 
మోసే జీవితనావ

            పచ్చని సేనులో పొద్దై మూకితేనే        
            మా పొయ్యిలో ఆకలిముద్దై వెలిగేది
            అమ్మంటే అన్నపూర్ణాదేవి ప్రతిరూపం

కట్టెలమోపు తలను పుండుచేసినా
లొట్టనెత్తితో నడుస్తూనే గడపన వాలేది 
ఎంచలేని గాయాలకు మందు అమ్మ

            సేను కొరకు ఎంత చెమటోడ్చినా
            రెక్కలకష్టం బొక్కలపులుసే మిగిలేది 
            అమ్మప్రేమ బుట్టి నిండా రొట్టెముక్కలు

ఏడేండ్లకే మనువొచ్చి 
ఎత్తుపల్లాలెన్ని చదునుచేసినా
అరుకబువ్వనే అమృతమై కడుపు నింపేది       
అమ్మ అంటే ఆకలి తీర్చే అంబలిగంప
.............................................................................................

అతినారపు హరిశంకర్
లట్టుపల్లి , 
నాగర్ కర్నూలు 
88863 63249

Post a Comment

0 Comments