నీటి మొగ్గలునీటి మొగ్గలు_harshanews.com
నీటి మొగ్గలు


నింగిలోని మేఘాలు వర్షంగా దిగివచ్చి                   
యావత్తు జీవరాశి దాహార్తిని తీరుస్తోంది
సర్వప్రాణులకు పరమౌషధం నీరు

జలవనరులతో ఉత్పత్తిని చేసే విద్యుత్       
విశ్వంలో వెలుగులుపంచే సూర్య భగవానుడు                      
బతుకు గమనానికి వెలుగుకిరణం జలం

ధరణితల్లి జీవనది జలధారలను పారించి 
పచ్చని పంటలు పండడానికి ఊతమవుతుంది
జగతికి మూలాధారమైన ప్రాణదాత జలం

మనిషి చావుపుటుకలకు నిత్యం జలచక్రమై
కష్టజీవుల గొంతుకలకు ఆసరానందించే భరోసా
నిత్యావసరాలకు నీరందించే దివ్యౌషధం జలం

అల్లాడుతున్న అడవి వృక్షసంపదకు ఊపిరియై   
వన్యప్రాణులకు ప్రాణవాయువు అవుతుంది
తరతరాలకు అక్షయపాత్రలా వారసత్వవనరు నీరు

మబ్బుతో అలుముకున్న మేఘాల నుంచి
ధరణిఒడిలో మమేకమై ఆనందతాండవం చేస్తుంది
పంచభూతాల్లో ప్రధానమైనది నీరు

నిర్మలమైన ప్రవాహఝరితో ప్రవహిస్తూ    
ప్రతిఇంటా నిక్షిప్తమై దాహార్తిని తీరుస్తుంది
బతుకుగమ్యాన్ని చేర్చే ప్రాణబంధువు జలం

తన బిడ్డలకోసమై భగీరథుడు విడిచిన గంగలా
జలధారలను పారించి పుడమిని తరింపజేస్తుంది
తరతరాలకు ప్రాణం పోస్తున్న జీవదాత జలం

ప్రతి మనిషి జీవనంలో ఆధారభూతమై      
కష్టజీవుల దాహాన్ని తీర్చే ఆపద్భంధువు
మనిషి అవసరాలకు తోడ్పడే ఔషధం నీరు

మొలకెత్తే విత్తనాలకు ఆసరాయయ్యి                 
ఆపన్నహస్తమై ఊపిరి పోసే సంజీవని
జగతిలో తరతరాల ఆనవాళ్లు నీళ్ళు.నీటి మొగ్గలు_harshanews.com
కొలిపాక శ్రీనివాస్
98665 14972

 

Post a Comment

0 Comments