స్నేహ కుసుమం

స్నేహ కుసుమం_harshanews.com
స్నేహ కుసుమం 


స్నేహకుసుమాలు
నేడెందుకో
స్వార్థపరిమళాల్ని వెదజల్లుతూ
మనసు విప్పడం మానేసి
మనసు విరవడం మొదలెట్టాయి

అడిగిందిచ్చినోడే ఆప్తుడవుతుండు
లేదన్నోడు నిందలుమోస్తూ నిస్తేజమౌతున్నడు

స్నేహసమూహాలన్నీ
అహం నింపుకుని ఏర్పాటువాదంవైపడుగులేస్తున్నయ్
ఎవరైనా మిత్రవాదమడ్డుపెట్టుకుని
వితండవాదంతో చిందులేస్తే
ఒకప్పుడు మనసంగతేంటని నెమరేసుకోవాలి

ఒకరిమీదొకరు చాడీలకుంపటినంటిస్తే
ఆర్పేవారెవరుండరు
చేయి చేయి కలిపి చేయుతనివ్వాలి
మనలోరగిలే అగ్నిజ్వాలలు సమూహాన్నంతటిని ఏంచేయదు
ఎదలోనుండి దూరంచేస్తుంది

ఎవరేంచేసినా వేన్నీళ్ళకు చన్నీటి సాయమే
మిగతాదంతా నీ సొంతమే
స్నేహంలో వేలెత్తిచూపకు

సాయంచేసే గుణం నీదైనప్పుడు
దైవమైవర్థిల్లందరిమదిలో

తటస్థతెపుడు మంచిదనుకోకు
మంచితనమందరిలో మౌనంగా దాగుంటుంది
సంభవించేదేపరిస్థితైనా
సాయమందిస్తుంది.

...........................................

సి.శేఖర్,
తెలుగు భాషోపాద్యాయులు,
పాలమూరు,
9010480557.

Post a Comment

0 Comments