బాలకథ జిలుగులు.. సిసింద్రుల కథలు

బాలకథ జిలుగులు.. సిసింద్రుల కథలు_harshanews.com
బాలకథ జిలుగులు.. సిసింద్రుల కథలు 

       
పాతకాలం నుండి ఇప్పటి కాలం వరకు కథకు చాలా ప్రాధాన్యత కలదు. ఇది ఇట్లా జరిగింది అనేది ఇతిహాసం అయితే... సంక్షిప్తత ఏకాంశవ్యగ్రత నిర్బరత స్వయం సమగ్రత సంవాద చాతుర్యం ప్రతిపద్య ప్రవణత ప్రభావాన్విత మొదలైనవి కథ లక్షణాలు . ప్రాచీన సాహిత్యం నుండి ప్రాచ్యాత్య సాహిత్యం వరకు కథకు చాలా ప్రాధాన్యత కలదు. మన తెలుగు సాహిత్యం లో 19 వ శతాబ్దంలో ఆధునిక కథకుల్లో పాలగుమ్మి పద్మరాజు "గాలివాన "కథ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించింది. కథలో విభిన్న ఆలోచనల ధోరణిలో మనసుల-మనస్సులను కదిలిస్థాయి.


కథల్లో చాల రకాలు కలవు...
అవి..సాంఘీక కథలు 
         రాజకీయ కథలు 
         ఆధ్యాత్మిక కథలు 
          ఒక ఎతైతే...
బాలలను బుద్ధి మంతులుగ తయారు చేయాలని ఆది గురువులైన అమ్మమ్మ  నాయనమ్మ  తాత య్యలు చెప్పిన మధరాతి మధురమైనవి. చిన్నారుల కథలు నేటి కాలంలో పిల్లలకు విద్యా బుద్దులు నేర్పుటకు నైతిక విలువలకు ప్రాముఖ్యం కల్పించినవి  డాక్టర్ రాములు గారి " సిసింద్రుల కథలు " అని అక్షరాల సత్యం .

ఈ సంపుటి లో 60 కథలు కలవు.ప్రధానంగా కొన్ని కథల్లో విషయాన్ని సంగ్రహం చేసినట్లయితే ...
కలం -హలం:- ఈ కథలో మాళవ రాజ్యాధిపతి-మహేంద్ర వర్మ  రామశర్మ-రైతు బాగుంటే కదా రాజ్యం సుభీక్షంగా వుండేది ...హలం కదిలినప్పుడే గదా ప్రభూ కలం కదిలేది...అంటూ చాలా చక్కని సందేశంతో పాటు నీతి...ఆపదలో ఉన్నప్పుడు మనం ఇతరులకు సహాయం చేయడం అనేది నిజమైన గౌరవం కదా!

అతితెలివి.. 
1.2.3..కథలు ఒకే శీర్షికతో విభిన్నమైన ఆలోచన సరళి కథా రీతిలో చాలా విభిన్న ధోరణిలో కథకుడు కథను నడిపాడు ..ఇది కథకుడి గొప్పతనం .

మిత్రద్రోహం-మిత్రలాభం... 
కథలో స్నేహం అనేది కష్టసుఖాలు సమానంగా  వుండాలని మన స్వార్ధం బయటి ప్రపంచంలో మనల్ని ఎదగనవ్వదని చక్కని నీతిని తెలియజేశారు ... అలాగే  అసత్యం -మంచి తనం కథలు కూడా ఎదుటి వారి గౌరవాన్ని తెలియజేశాయి.

ధర్మం కోసం..
ఈ కథలో నాటి కాలంలో రాజుల దగ్గర సేవ చేసే మంత్రులు వారి విధివిధానాలు ధర్మం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దపడితే ఈనాటి లోకం నాలుగు కాలాలు మనగల్గుతుంది. "ధర్మో రక్షిత రక్షతః" .

ఈ కథల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణలోని గ్రామనామాలతో పాటుగా ఆనాటి కాలంలో బాగా పేరు పొందిన ఎంతో మంది పేర్లు నమోదు చేయడం జరిగింది .కథ వస్తువు చిత్రికరణ పాత్రలు పాఠకులకు చదవాలని ఆసక్తిని  కల్గించాయి..ఈ కథలు చదువు తున్నప్పుడు ప్రతి ఒక్కరు తన మేధస్సుకు పదును పెడితే కొత్త కథ రాయడమే గాక ఎంతో మందికి ఆదర్శంగా మెలగవచ్చు.  కథలు మన జీవితానుభూతులు..  మానవ మంత్రాలు కావివి  మాటల తంత్రాలు .


బాలకథ జిలుగులు.. సిసింద్రుల కథలు_harshanews.com

సమీక్షకులు.. 
స్పూర్తి రత్న 
కోలంట్ల రామకృష్ణ 
జలదుర్గం (కర్నూలు )
99668 04126 

Post a Comment

0 Comments