కలల సిరిచిత్రం

కలల సిరిచిత్రం_harshanews.com
కలల సిరిచిత్రం 


దూరాన ఉన్న ఓచెలీ

నీ జ్ఞాపకాలతో మైమరిచానే
మనసులో నీరూపం దాచుకొని
కలలే కంటున్నా నీకోసం
నా ఊహలే ఎగిరినే నీ ఊసుల దరికే

నీప్రేమ అనే ఒయాసిస్సులో
ఓలలాడి నేమునిగిపోయి ఉన్నా
దారి తెలియని ఈ జీవితంలో
కనిపించావు ఎడారిలో గులాబీలా ఓక్షణం

మదిలోని నీరూపం ఎంతో అపురూపం
హృదయమందిరంలో దాచుకున్న వర్ణం
నయనాల చెంతకు చేరి ఉబికి
కనుల సిరా ఒలికి కలలచిత్రం గీస్తే

అందాల కవితల కలల సిరి రాణి
నాముందు ఆవిష్కృతమైంది

చూపుల వలవేసి బంధించి
నవ్వుల తెరచాటు తొలగించవేమి
విరహాల ఉప్పెనలో వేగిపోతున్నా
ఇంకా నన్ను చంపకే 
ప్రేమ పంపకాల చంపకమాల

.....................................................

రవికిరణం
సత్యనీలిమ
వనపర్తి
9502156813

Post a Comment

0 Comments