సాహిత్య వినువీధులలో అక్షరసేద్యం

సాహిత్య వినువీధులలో అక్షరసేద్యం_harshanews.com
సాహిత్య వినువీధులలో అక్షరసేద్యం 

హనుమాజిపేట ఆణిముత్యమైన కవితా ఝరిగా 
రసరమ్య ప్రవాహంలా సాగించిన సాహిత్య జీవనది
సాహిత్య వినువీధులలో అక్షరసేద్యం చేసిన సినారె.

నవ్వనిపువ్వుతో రచనలప్రస్థానం ఆరంభించి
వచనకవితా జగత్తులో తనదైన ముద్రను వేశాడు
మనోజ్ఞమైన కవిత్వానికి రూపానిచ్చిన శిల్పి సినారె

మధ్యతరగతి మందహాసాన్నీ విశ్వతరాలలో ఎగిరేసి
విశ్వసాహిత్యానికి దారులువేసి విశ్వనరుడవయ్యావు
తెలుగు సాహిత్యానికి నవ్యపోకడలనిచ్చిన సినారె.

విశ్వమానవ హృదయాంతరాళాల్లో విశ్వంభరుడై
జలపాతాల సవ్వడినీ మానవీయంగా రంగరించాడు
కలంతో నవరసాలు పలికించిన కవిచంద్రుడు సినారె

నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ
మధురమైన పాటలను కుప్పలుగా రాసిన ఘనుడు
మనసుకు హాయినిచ్చే పాటల ఊట మన సినారె

ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలతో
కొత్తవరవడితో అత్యంత ప్రామాణిక గ్రంథమైనది
పరిశోధకుల మన్ననలు పొందిన విశిష్ట రచన సినారెది

గేయాల్లో తేటతెలుగు పదాలు తియ్యని భావాలతో
జలపాతాల సవ్వడినీ కమనీయంగా సాగించాడు
నిగూఢ ప్రాసపదాలతో కనువిప్పు కలిగించిన సినారె

ఉర్దూ ముషాయిరాలలో మునకలేసి గజల్లకు ప్రాణపోసి
అమృత కంఠంతో నాలుకపై నాట్యమాడించాడు
అక్షారాలతో నాగార్జున సాగరమై ప్రవహించిన సినారె.

పాటల గానామృత సంద్రంలో విరిసిన హరివిల్లవుతూ
పాటలకు ప్రాణంపోసి..అపారసంగీత కవి శ్రేష్ఠుడు 
తెలుగుతల్లి బిడ్డగ విశ్వవేదికపైన జ్ఞానపీఠమై వెలిశాడు

చైతన్యప్రబోధమైన కవితతో గజల్ ను అల్లుతూ
శబ్దధ్వని మేళవించి భావచమత్కృతి అందిస్తోంది
గజల్ తో ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు సినారె


......................................................
సాహిత్య వినువీధులలో అక్షరసేద్యం_harshanews.com

కొలిపాక శ్రీనివాస్
 సింగరాజపల్లలి,దామెర,
  వరంగల్ రూరల్ జిల్లా. 
9866514972Post a Comment

0 Comments