గాన సుధాకరుడు.. మంగళంపల్లి

గాన సుధాకరుడు.. మంగళంపల్లి_harshanews.com


గాన సుధాకరుడు గా పేరు పొందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జూలై ఆరవ తేదీన తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్త గ్రామములో జన్మించారు. సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య వీరి తల్లిదండ్రులు. చిన్నతనములోనే సంగీత మేథావిగా గుర్తింపు పొందినాడు. అపర గాన గంధర్వుడు, కర్ణాటక సంగీత నిధి, వయోలిన్ విద్వాంసుడు, అద్భుత వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు.

9వ పుట్టిన రోజే రెండున్నర గంటలకు పక్క కచేరీ చేసిన ఘనుడు, భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరంఅనే మలయాళ సినిమాలో నటించాడు.సంగీత జగత్తులో ధృవతార గా నిలిచాడు.సూర్యకాంతి, లవంగి, మోహనాంగి, మహతి, ప్రతి మాధ్యమా వతి, ఇలాంటి అనేక రాగాలు సృష్టించాడు. వాక్కును, గేయాన్ని సొంతం చేసుకొని వాగ్గేయకారుడిగా ప్రశంసలు పొందాడు. బాల మురళి 430 బాణీలలో 72 మేళకర్త రాగాలకు ఒక్కొక్క కృతిని రాసి స్వరపరిచారు. సంగీత యుగపురుషుడైనాడు. ఐదువేలకు పైగా కచేరీలు చేశారు. ప్రముఖ వాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య సరసన నిలిచాడు.


గాన సుధాకరుడు.. మంగళంపల్లి_harshanews.com
గాన సుధాకరుడుగా పేరు పొందిన మంగళంపల్లి 

బాల మురళీ కృష్ణ విజయవాడలో భక్తి రంజిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా నిలిపిన ఘనత మంగళంపల్లిదే. కొంతకాలం విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశాడు. ఆయన గాత్రం తో పాటు వయోలిన్, కంజీర, వేణువు, వీణ, మృదంగం వంటి ఇతర సంగీత వాయిద్యాల లోనూ ప్రావీణ్యం ఉంది. ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుల తో కలిసి జుగల్ బంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు, డీలిట్ పట్టాలు అందుకున్నాడు. వందలాది బిరుదులు వేలాది సత్కారాలు మంగళంపల్లి బాలమురళీకృష్ణను వరించాయి. భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ (1971), పద్మ భూషణ్, పద్మ విభూషణ్(1991) పురస్కారాలు అందుకున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వము నుండి షెవాలియర్ అవార్డు,ఐక్యరాజ్యసమితి నుండి యునెస్కో అవార్డు, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ద్వారా సంగీత కళానిధి, జాతీయ స్థాయిలో ఉత్తమ నేపథ్య గాయకుడు,పురస్కారాలు అందుకున్నారు. 1994లో ఆంధ్ర ప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రోఛాన్సలర్ గా నియమించబడ్డారు.

తిరుపతి తిరుమల దేవస్థానం, శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడిగా ను, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఆస్థాన విద్వాంసులు గానూ నియమించబడ్డాడు. ఎన్నో బిరుదులు, పదవులు, పురస్కారాలు ఆయన్ను అలంకరించాయంటే ఆయన శక్తి సామర్ధ్యాలు ఏమిటో మనకు అర్ధమవుతాయి. గౌరవాలకు ఆయన అలంకారం అయ్యారు. ఆయన ఎన్ని పురస్కారాలు వచ్చినా వాటికంటే ఒక మెట్టు పైనే ఉండేవారు. అపర త్యాగయ్య గా, అభినవ అన్నమయ్య గా కీర్తి గడించాడు.

ఆయనకు గాయకుడిగా అద్భుతమైన శరీరం ఉన్నది, అది మందార గాంధారము నుంచి తారాషడ్జమం పలుకుతుంది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోనూ క్రమశిక్షణను విడువలేదు.
రాగము, స్వరము,లయ అతని బానిసలుగా ఉంటాయి. వాటిపైన అతను చూపే అధికారం అనన్య మనిపిస్తుంది. కీర్తనలు పాడడం లోనే కాదు. ఆలాపన లో కూడా అభినయం చూపగలడు బాలమురళి. అతని స్వరకల్పనలో చిత్రలేఖన సూత్రాలు. చిన్న చిన్న ముగ్గులుగా, క్లిష్టమైన కంపోజిషన్లు కనిపిస్తాయి, వినేవాడికి.

చతుషష్టి కళలలో లలిత కళలు ప్రత్యేకమైనవి. "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణః"అన్నారు పెద్దలు. అలాంటి సంగీత సాగరంలో మునిగితేలిన వాడు మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు శాస్త్రీయ సంగీతం అంటే ఏ కొద్ది మందికి మాత్రమే అపోహ ఉండేది. దానిని తుడిచిపెట్టి లక్షలాది మంది శ్రోతల్ని ప్రాణముతో కట్టిపడేసిన మహనీయుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాత్రమే. ఈ కాన గంధర్వుడు 22/11/2016 న తన సంగీతాన్ని వినిపించడానికి స్వర్గలోకం చేరుకున్నాడు.

గాన సుధాకరుడు.. మంగళంపల్లి_harshanews.com
కొప్పుల ప్రసాద్,
నంద్యాల
98850 66235


 

Post a Comment

0 Comments