జ్ఞానానికి లోటు


జ్ఞానానికి లోటు_harshanews.com
జ్ఞానానికి లోటు 


గురు బ్రహ్మవు నీవే
మా గురు శ్రీవిష్ణువు నీవే
జ్ఞానాన్ని పెంచి
విద్య ను బోధించి 
చదువుల సారము వివరించి
క్రమశిక్షణ నేర్పించి
మా మనసుల్లో కొలువు దీరిన 
మరపురాని మా దైవమా!
గురుదేవోభవః

నీ శక్తిని అంత కుడగట్టుకుని
విధ్యార్ధులకు చక్కని 
నడవడికను నేర్పించి
నిత్యం కొత్త పాఠాలు నేర్చుకుంటూ
పిల్లలకు నేర్పిస్తూ
వారికి స్ఫూర్తి దాతగా ఉంటూ
నీ బోధనలే వారిభవితలకు
చక్కని మార్గముగా ఉంటున్న
గురువు

ఇలాంటి గురువుకి 
నేడు ఆదరణ కరువయింది
ప్రైవేట్ ఉపాధ్యాయులకు
ప్రస్తుతం కష్టకాలం పరుగులు తీస్తుంది

అసలే చాలీ చాలని జీతాలు
ఇంకా అందులో ఈ కరోన వల్ల
ఇప్పుడు అసలే లేని జీతాలు
ఇక గురువు గారి పరిస్థితి...

పిల్లలు రారు,పాఠశాలలు లేవు
కుటుంబాలు గడవలేని పరిస్థితి
చేసేదిలేక కొంతమంది 
నేలమ్మను నమ్ముకున్నారు
ఇంకా కూలీలుగా మారారు
ఇంకా వారి పరిస్థితి దారుణం

మా పై దయ ఉంచి......
కరోనా కరుణచూపు ఇకనైన
కానరాక మాకు ఇకపైన

..................................................................................
 

టి.సంయుక్తాకృష్ణమూర్తి
                    M.C.A,M.ED
కరీమబాద్
వరంగల్ జిల్లా 
85001 75459

Post a Comment

0 Comments