ఇంకేం కావాలి...!

ఇంకేం కావాలి...!_harshanews.com
ఇంకేం కావాలి...! నా  అక్షరాలకి
నీ అక్షువులు
ఊపిరవుతుంటే

నా పదాలకి
నీ పెదాలు
ఊతమిస్తుంటే

నా వాక్యాలకి
నీ మనసు
ఉప్పొంగి పోతుంటే

నా కవనాలకి
నీ రూపం
కావ్యమవుతుంటే

నా పుస్తకాలతో
నీ తనువు
సేదతీరుతుంటే

అంతకన్నా
ఇంకేం కావాలి
ఈ కవి హృదయానికి

ఇక సాహితీ విశ్వాన్ని
జయించినట్టేగా...

............................................................................................

కయ్యూరు బాలసుబ్రమణ్యం
 శ్రీకాళహస్తి
 94417 91239

Post a Comment

0 Comments