విచిత్రం

విచిత్రం
Image by mbll from Pixabay 

కాలమెంత చిత్ర విచిత్రమైనది
మన కంటికి కనిపించేది అంతా
మాయే అని మనసుకు తెలసిన కాలం 
ఆడే వింత ఆటలో మనం మునిగిపోతామ్
మనుషులు ఎప్పటికప్పుడు 
నూతన పరిచయాలకే 
వెతుకులాడుతారు అని
తెలసిన నన్ను మరిచాడు
అని కృంగిపోతామ్..

కాలమెంత చిత్ర విచిత్రమైనది
‌బాధలో నువ్వుంటే మరుక్షణమే మైమరిపిస్తుంది..
జ్ఞాపకాలతో బ్రతకనివ్వకుండా
కొత్త సరికొత్త ఆలోచనలు నీ
మదిలోకి రప్పిస్తుంది...
రేపు అనేది సృష్టించి ఈనాటి
క్షణాన్ని ఆనందింపజేస్తుంది...

కాలమెంత చిత్ర విచిత్రమైనది
ఆశయాలను నీలో నింపి
అనునిత్యం సాధన చేసే విధంగా నీ
తనువుని సిద్ధం చేసి
సాధించే దిశగా నిన్ను నడిపిస్తుంది...
నిత్యం నీలో జ్ఞానజ్యోతి
వెలిగే విధంగా నిన్ను
ఉన్నతంగా తిర్చిదిద్ది అదే
కాలానికి నిన్ను పరిచయం చేస్తుంది..
కాలమెంత చిత్ర విచిత్రమైనది

విచిత్రం_harshanews.com

ఆర్. మాధవి
91828 18057
 

Post a Comment

0 Comments